స్టార్ హీరో సినిమా అంటే వారికి ఫ్యాన్స్ ను ఎలాగైనా థియేటర్స్ కు రప్పించే అవసరం ఉండదు.. కాని చిన్న హీరోల సినిమాలు మొదటి రోజు చూడాలంటే కచ్చితంగా స్టార్ హీరోల ఇమేజ్ ను వాడుకోవాలి.. ఇక సినిమాలో స్టార్ హీరోలకు ఓ కృతజ్ఞతల కార్డ్ వేస్తే ఇక కెవ్వు కేకే.. ఎందుకంటే స్టార్ హీరోలకు బీబత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. సినిమా టైటిల్ కార్డ్ లో తమ అభిమాన నటుడి పేరు వచ్చినా చాలు చాలా సంతోశిస్తారు. 


ప్రస్తుతం ఈరోజు రిలీజ్ అవుతున్న నాని కృష్ణ్గగాడి వీర ప్రేమగాధ సినిమాలో సూపర్ స్టార్ మహేష్, నందమూరి నట సింహం బాలయ్యకు కృతజ్ఞతల బోర్డ్ వేశారు. సినిమా ఆడియోకి వచ్చినందుకు మహేష్ కు థాంక్స్ చెబితే.. బాలయ్యతో లెజెండ్ అంటూ హిట్ కొట్టారు కాబట్టిన 14 రీల్స్ ఈ సినిమాలో హీరోను బాలయ్య అభిమానిగా చూపించారు. సో నందమూరి ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసేలా ప్లాన్ వేశారు. సినిమా ప్రేక్షకులకు చేరవేయడంలో దర్శక నిర్మాతల వ్యూహ రచనలో భాగమే ఈ కృతజ్ఞతల పరంపర.  


సినిమాకు సంబంధం ఉన్నా లేకున్నా సినిమాలో టైటిల్ కార్డ్ పడాల్సిందే. సినిమాకు ఒక నిమిషం సహాయం చేసినా స్టార్ హీరో నేం టైటిల్ కార్డ్ లో పడుతుంది. మరి సినిమా హిట్ టాక్ తెచ్చుకోడానికి ఇదో ప్రయత్నం అనేస్తున్నా.. టైటిల్ కార్డ్ లో స్టార్ హీరో పేరు వేసినా సినిమాలో విషయం లేకపోతే సినిమా ప్రేక్షకులు ఫ్లాప్ చేసేస్తారు అనేస్తున్నారు కొందరు.


హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అవుతుందనే ఆశిస్తున్నాడు ఈ దర్శకుడు. మొదటి సినిమా అందాల రాక్షసి ఓకే అనిపించినా కాసుల వర్షం కురిపించలేదు. కాని ప్రస్తుతం నానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా కృష్ణగాడి వీర ప్రేమ గాధ కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెబుతున్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే..!  



మరింత సమాచారం తెలుసుకోండి: