తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో…ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు.


ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా..చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు.


అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి…సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు.


అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే…వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక  'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం “వంగవీటి”తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: