తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. అంతా నా ఇష్టం అనే రీతిలో సాగిపోయే ఈ దర్శకుడు తాజాగా వంగవీటి రంగ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. గత 30 ఏళ్లక్రితం బెజవాడలో జరిగిన రాజకీయ గొడవల నేపధ్యంతో వర్మ వంగవీటి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోండగా దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే 30 ఏళ్ల క్రితం ముగిసిన రాజకీయ గొడవలు మళ్లీ తెరకెక్కిస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

ఇక వర్మ చాలా వరకు నేటివిటీ కి తగ్గ చిత్రాలు తీస్తారని అందరికీ తెలుసు గతంలో రక్త చరిత్ర ఈ మద్య కిల్లింగ్ వీరప్పన్ చిత్రాల వ్యక్తులకు సంబంధించిన చిత్రాలే..అయితే ఆ చిత్రాలు మంచి ప్రేక్షకాధరణ పొందాయి. తాజాగా వంగవీటి రంగ చిత్రంతో మరోసారి తన టాలెంట్ చూపించాలని అనుకుంటున్నారు వర్మ.  అంతే కాదు వంగవీటి రవి - వంగవీటి రాధాల జీవిత నేపధ్యంతో ఈ చిత్రం తెరకెక్కనుందని వర్మ గతంలో తెలపగా, తెలుగులో ఇదే తన చివరి చిత్రం అని తాజాగా ప్రకటించారు. వాస్తవానికి గతంలో నాగార్జున తో తీసిన చిత్రం గోవిందా గోవింద చిత్రానికి సెన్సార్ కట్స్ ఎక్కువగా పడ్డాయని భావించిన వర్మ తెలుగు సినిమాలు తీయనని ప్రకటించి ముంబయి వెళ్ళారు .


అక్కడ సత్య, సర్కార్, రంగీల వంటి సినిమాలు సక్సెస్ సాధించారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుకున్న వర్మ హైదరాబాద్ వచ్చి సెన్సేషనల్ చిత్రాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. మళ్లీ ఇప్పుడు తన చివరి చిత్రం వంగవీటి  రంగ అనడంపై మరోసారి విమర్శలు తలెత్తుతున్నాయి.

తాజాగా రాంగోపాల్ వర్మ ఎంతగానో మెచ్చుకున్న కమెడీయన్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా వర్మపై తన ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. గోవిందా సినిమానే తన చివరి సినిమా అన్న వర్మ ఇప్పడు మళ్లీ వంగవీటి అంటున్నాడేంటని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి దీనిపై వర్మ నుండి ఏదైన సమాధానం వస్తుందో లేదో చూడాలి. 


వంగవీటి రంగ ఫస్ట్ లుక్ స్టిల్స్


సంపూర్ణేష్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: