మాస్టర్ బ్రెయిన్ రామ్ గోపాల్ వర్మతో, టాలీవుడ్ హీరో శివాజీ ఓ టీవి ఛానల్ ముఖంగా గొడవ పెట్టుకోవటం ఇండస్ట్రీలో చర్ఛనీయాంశంగా మారింది. తాజాగా వర్మ ఓ టీవి షో లో తన అప్ కమింగ్ మూవీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తను రిలీజ్ చేసిన ప్రమోషన్ సాంగ్ లో కమ్మ, కాపు అనే పదాలు వింటుంటే ప్రతి ఒక్కరిని కులాలను గుర్తుకు తెస్తుందని అంటున్నారు.


అందుకే తన పాటలోని కమ్మ, కాపు మాటలను తీసివేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక టీవి ఛానల్ లో కూర్చున్న వర్మ తో మాట్లాడటానికి యాక్టర్ శివాజీ ఫోన్ లైన్ లోకి వచ్చారు. తను వర్మని ప్రశ్నించటం లేదని, కానీ కమ్మ..కాపు అంటూ తన మూవీలోని పదాలను తొలగిస్తే మంచిదని కోరుకున్నాడు. సమాజం పట్ల బాధ్యతతో ఉండాల్సిన వ్యక్తే ఇలాంటి రెచ్ఛగొట్టే పదాలు వాడటం కరెక్ట్ కాదని అన్నారు. అయితే ఈ విషయంపై వర్మ ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చినప్పుడు శివాజితో కూర్చొని మాట్లాడతానని చెప్పుకొచ్చాడు.


కానీ ఈ సందర్భంలో శివాజి చెప్పిన అవగాహన తనకు ముందే ఉందని శివాజిపై కౌంటర్ వేశాడు. అయితే వెంటనే మళ్ళీ ఫోన్ లైన్ లోకి వచ్చిన శివాజి, వర్మ చెబితే వేదాలు, మేమే చెబితే క్లాసులా అంటూ వ్యంగంగా మాట్లాడటం చూసే వారికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓ రకంగా చెప్పాలంటే వర్మ, శివాజీతో సామరస్యంగానే ఉందామని అనుకున్నాడు కానీ..శివాజీ మాత్రం వర్మతో తనకు నచ్ఛిన విధంగా మాట్లాడి..వర్మ ఇక మారడు అన్నట్టుగా ముఖం మీద చెప్పేసి వెళ్ళటం కొద్దిగా ఓవర్ అనిపించిందని అంటున్నారు.


మొత్తంగా రామ్ గోపాల్ వర్మ తో శివాజీ పెట్టుకున్న గొడవ ఇప్పడు ఫిల్మ్ ఇండస్ట్రీ హాట్ టాక్స్ గా మారింది. ఈ విషయంలో పలువురు వర్మతో అనవసరంగా పెట్టుకున్నాడు అని శివాజీతో అంటున్నారు. ప్రస్తుతం శివాజీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాంలో లేకపోవటంతోనే ఇండస్ట్రీలో తనని ఎవరూ..ఏం చేయలేరనే ధీమాతోనే వర్మతో ఆ విధంగా మాట్లాడి ఉంటారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: