పవన్ కళ్యాణ్ ఏమిచేసినా అది వార్తలకు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. సినిమాలైన, రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితం అయినా ఇలా పవన్ సంబంధించిన ఏ విషయంలో అయినా ఒక న్యూస్ వచ్చింది అంటే చాలు అది వెంటనే మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోతుంది. ప్రస్తుతం అటువంటి సందర్భమే మరొకటి ఈమధ్యనే జరిగింది. 

ఈ మధ్య కాలంలో పవన్ ఎక్కడకి వచ్చినా స్పెషల్ ఫ్లైట్స్ లో ప్రయాణాలు చేస్తున్నాడు. ఆమధ్య కాపు రిజర్వేషన్ సమస్య పై ప్రెస్ మీట్ లో మాట్లాడటానికి కేరళా నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించాడు. లేటెస్ట్ గా ప్రముఖ రాజకీయ వేత్త అంబటి రాంబాబు కుమార్తె పెళ్ళికి మళ్ళీ కేరళా నుంచి తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ బ్రేక్ ఇచ్చుకుని మళ్ళీ ప్రత్యేక విమానంలో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.

ప్రత్యేక విమానాలు ఇలా ఎప్పుడు  కావాలంటే అప్పుడు సొంత కారులా వాడుకుంటున్న పవన్ విమాన ప్రయాణ వ్యవహార శైలి పై ఫిలింనగర్ లో ఆ శక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాను స్థాపించిన ‘జనసేన’ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్ధులను నిలబెట్టడానికి డబ్బులు లేవు అని బహిరంగంగా చెప్పిన పవన్ ఇప్పుడు ఇంత విలాస వంతంగా ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక విమానంలో తిరుగుతూ వాటికి అద్దె కట్టడానికి భారీ మొత్తాలు పవన్ కు ఎక్కడ నుంచి వచ్చాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి.

ఆ మధ్య ఒక ఆడియో ఫంక్షన్ లో అల్లుఅర్జున్ పవన్ క్రేజ్ ఎప్పుడూ గాలిలో తిరుగుతూ ఉంటుంది అని కామెంట్ చేసిన నేపధ్యంలో పవన్ ప్రస్తుతం హనుమంతుడులా మారిపోయి గాలిలో సంచరిస్తూ ఎక్కడకు కావాలి అనుకుంటే అక్కడకు వెళ్ళి పోతున్నాడా ? అంటూ మరి కొందరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ స్పెషల్ ఫ్లైట్స్ కథ ఫిలింనగర్ కు హాట్ టాపిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: