నాచురల్ స్టార్ ఇమేజ్ తో నిన్న విడుదలైన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాకు మొదటి రోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు అగ్ర హీరోల అభిమానులు కూడ అండగా ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అని అంటున్నారు. ఈసినిమాలో నాని బాలకృష్ణ అభిమాని అని ముందుగానే ప్రచారం జరగడంతో చాల ధియేటర్ల ముందు బాలయ్య ఫ్యాన్స్ సందడి కనిపించడమే కాకుండా కొన్ని చోట్ల బాలకృష్ణ కటౌట్లు కూడ కనిపించాయి. 

దీనికి తోడు నానీ నోటి వెంట బాలయ్య ప్రస్తావన వచ్చిన ప్రతి సీన్ లోను బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడ నానీ తేవడంతో పవన్ అభిమానులు కూడా పొంగి పోతున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా సినిమా ప్రారంభానికి ముందు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అండగా ఉన్న మహేష్ బాబు స్టిల్ కూడా వెండితెరపై చూపెడుతూ ‘మేము మళ్ళీ కోలుకోవడానికి దోహదపడిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు’ అంటూ సినిమాలో వేసిన థాంక్స్ పోస్టర్ ను చూడగానే మహేష్ అభిమానులు కేరింతలు కొట్టారు.

ఇక వెబ్ మీడియాలో ప్రస్తుతం ‘జై బాలయ్యా’ టాటూలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. చేతిపై ఈటాటూ వేయించుకుని వెబ్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు బాలయ్య అభిమానులకు ఫ్యాషన్ గా మారింది. స్టార్ హీరోల అభిమానులు ఇతర హీరోలను కూడా అభిమానించడం కొత్తేం కాదు కానీ ఇలా ఓపెన్ గా సపోర్ట్ చేయడం మాత్రం నాని ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ తో మొదలైన సరి కొత్త ట్రెండ్ అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: