సినిమాల విజయంతో సంబంధం లేకుండా రకుల్ ప్రీత్ క్రేజ్ రోజురోజుకి పెరిగి పోతూ ఉండటంతో రకుల్ ప్రీత్ పారితోషికం కూడ భారీ స్థాయిలో పెరిగి పోతోంది. ఈమె నటనకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఎక్స్ పోజింగ్ కు పారితోషికానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పారితోషికం నచ్చితే చాలు ఏ హీరోతో అయినా నటించేస్తుంది అన్న విషయాల పై రకుల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

పారితోషికం భారీగా ఇస్తే ఐటమ్ సాంగ్స్ లో కూడ నటిస్తూ కాలం గడుపుతున్న నేటి టాప్ హీరోయిన్స్ ఏదైనా ఇంటర్వ్యూలు  ఇచ్చినప్పుడు మాత్రం చిరకాలం నిలిచిపోయే పాత్రలను చేయాలని ఉంది అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇదే విషయం పై రకుల్ విభిన్నంగా స్పందించింది.

‘నాకు కుంటి సాకులు చెప్పడం రాదు. నేనో పెద్ద నటి అని నిరూపించుకునేందుకు ఇండస్ట్రీలోకి రాలేదు. నాకంటే హేమాహేమీలు బోలెడు మంది ఇక్కడ ఉన్నారు. ఏదో ఉన్నంత సేపూ అందంగా కనిపించాలి. ఈ రోల్ ని రకుల్ చెడగొట్టలేదు అనిపించుకుంటే చాలు’ అంతేకాని తనకు పెద్దపెద్ద లక్ష్యాలు పెద్దపెద్ద పాత్రల గురించి ఆలోచనలు లేవు అని షాకింగ్ కామెంట్స్ చేసింది రకుల్. 

అంతేకాదు తనకు క్రేజ్ ఉన్నంత సేపు స్పీడ్ గా నాలుగు కాసులు గణించుకుని ఆ తరువాత హాయిగా సెటిల్ అయిపోదామని అనుకుంటున్నాను అంటూ తనకు పెద్దగా డ్రీమ్ రోల్స్ ఏమి లేవు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చింది రకుల్. అయితే రకుల్ చెప్పిన మాటలు కొద్దిగా అతి అనిపించినా నేటి గ్లామర్ బ్యూటీల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి అనడానికి రకుల్ మాటలే ఉదాహరణ..   



మరింత సమాచారం తెలుసుకోండి: