నిన్న విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు. ఇతడి మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ ని చూసి చాలామంది ఇతడు ప్రేమ కథలు తీయడంలో  ఎక్స్ పర్ట్ అని అనుకున్నారు అంతా. 

అయితే అందరికీ ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఆ ప్రేమ కథల విషయాన్ని ఆ సినిమాతోనే మరిచిపోయి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో ఈ సినిమా దర్శకుడు చేసిన ప్రయోగాలు చూసి టాలీవుడ్ టాప్ దర్శకులు కూడ షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమా నిర్మాతల ప్రభావమో లేక నాని ప్రభావమో తెలియదు కాని ఈసినిమా చూసిన విశ్లేషకులు ఇది నిజంగానే హను రాఘవపూడి తీసిన సినిమానా ? అని కామెంట్స్ చేసే స్థాయిలో తీసాడు.

ఒకే సినిమాలో అనేక అంశాలు కలుపుతూ ప్రేమ, ఫ్యాక్షనిజం, మాఫియా, అడ్వెంచర్ ఇలా అన్ని కలిపి ఒక సినిమాగా మార్చి ఇప్పటి వరకూ ఏ దర్శకుడు తీయని విధంగా తీయడంతో బయటకు వస్తున్న ప్రేక్షకులు తాము ఇప్పటి వరకు చూసిన సినిమా ఏమిటో వారికే అర్ధం కాక ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయి చిట్ట చివరకు సూపర్ హిట్ అనేస్తూన్నారు అని టాక్.

దీనితో దర్శకుడు హను తన దగ్గర ఉన్న కథలన్నీ ఒక సినిమా కోసమే వాడేసినట్టు అనిపిస్తోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. కానీ ఇన్ని కథలున్నా ఎక్కడా గందరగోళానికి గురికాకుండా ప్రేక్షకుల్ని తికమక పెట్టకుండా సినిమాని డీల్ చేయడంతో ఈ దర్శకుడు ప్రేక్షకుల నుండి సక్సస్ టాక్ ను తెచ్చుకున్నాడు. ఈసినిమా చూసిన ఏ టాప్ హీరోకి అయినా ఈ దర్శకుడు చేసిన ప్రయోగాలు నచ్చుతాయి కాబట్టి త్వరలోనే ఎవరో ఒక టాప్ హీరోతో హను రాఘవ పూడి భారీ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: