హాలీవుడ్ లో ఫోర్న్ స్టార్ గా హంగామా చేసిన సన్నీలియోన్ జిస్మ్2 చిత్రంతో బాలీవుడ్ ఎంటర్ ఇచ్చింది. తర్వాత తెలుగులో కూడా మంచు మనోజ్ సరసన ఐటమ్ సాంగ్ లో వచ్చింది. ఇక సన్నీలియోన్ వచ్చిన తర్వాత బాలీవుడ్ సినిమా స్టయిల్ పూర్తిగా మారిపోయింది..అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక దశలో నెటిజన్లు ఎక్కువ సన్నీలియోన్ చిత్రాలే చూస్తున్నట్లు ఆ మద్య వార్తల్లో కూడా వచ్చింది. ఈ మద్య ‘మస్తీజాదే’ చిత్రం విడుదలై విపరీతమైన కలెక్షన్లు సాధించింది. 

ఇక బాలీవుడ్ లో సన్నీపై ఎప్పుడూ చిందులేసే ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి రెచ్చిపోయింది. గత కొంత కాలంగా సన్నిలియోన్ పై ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి సన్నీ అభ్యంతరకర ప్రశ్నలు ఎదుర్కొన్న సమయంలో ఆమె ప్రవర్తించిన తీరుపై బాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలతోపాటు మద్దతు లభించింది.

రాఖీ సావంత్


అంతే కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ సన్నీతో నటించేందుకు సిద్దం అన్నారు..దీంతో చిర్రెత్తుకొచ్చిన రాఖీ సావంత్ ఇక్కడ ఫోర్న్ స్టార్లకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు..తాను కూడా త్వరలో పోర్న్ స్టార్ కావాలనుకుంటున్నా అని చెప్పింది. దీంతో సన్నిహితులు, బాలీవుడ్ ఇండస్ట్రీ వారు అందరూ ముక్కున వేలేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: