టాలీవుడ్ సినిమాలు అంటే ఒకప్పుడ్డు తెలుగు ఉమ్మడి రాష్ట్రానికే పరిమితం అయ్యేవి. కాస్త కర్ణాటక లో కూడా వసూళ్లు బాగా ఒస్తే గొప్ప విషయం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం . బౌండరీ లు చెరిగిపోయి ప్రపంచవ్యాప్త వసూళ్లు అదరహో అనిపిస్తున్నాయి. మొత్తం కలక్షన్ లలో దాదాపు పావాలా శాతం బయటే వస్తున్నాయి అంటే ప్రపంచం లో మన సినిమాలు ఎంతగా ప్రాచుర్యం పొందాయో అర్ధం చేసుకోవాలి.

 

 

 

ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లు గా చేసిన వారు నిర్మాతలుగా మారే గారు కానీ ఇప్పుడు కొత్తగా ' ఎన్నారై' డిస్ట్రిబ్యూటర్ లు కూడా ప్రొడక్షన్ మొదలు పెట్టేసారు. ఇదివరకు మహేష్ బాబు దూకుడు , ఆగాడు లాంటి సినిమాలకి ప్రొడ్యూస్ చేసిన  14 రీల్స్ ఒకప్పుడు ఎన్నారై డిస్ట్రిబ్యూటర్ గానే ప్రాస్తానం మొదలు పెట్టింది. ఈ మధ్య ఒచ్చిన మైత్రీ మూవీస్ బ్యానర్ కూడా అలాంటిదే. ఇప్పుడు అదే లెక్కలో మరొక సంస్థ నిర్మాణంలోకి అడుగు పెడుతోంది.

 

 

'లార్గాన్ ఎంటర్టైన్మెంట్' అనే బ్యానర్ మీద సినిమా చెయ్యడం కోసం సర్వం సిద్దం అవుతోంది. ఆస్ట్రేలియా - న్యూ జీలాండ్ దేశాలలో తెలుగు సినిమాల కి  డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన రామూ అక్కాల దీనికి ఓనర్ . ఆస్ట్రేలియా - న్యూ జీ లాండ్ దేశాల్లో పంపిణీ అయిన భారీ సినిమాలు అన్నీ వీరు డిస్ట్రిబ్యూషన్ చేసినవే. సినిమాల మీద ఇష్టం తో నిర్మాణ రంగంలోకి వస్తున్నాం అని చెబుతున్నారు . నాగ శౌర్య హీరోగా సాయి చైతన్య డైరెక్షన్ లో ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారు ఈ సంస్థ వారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: