హిట్ లు ఉన్నా లేకపోయినా చిన్నా చితకా డైరెక్టర్ లు ఎదో ఒక సినిమా తీస్తూ బిజీ గా కనిపిస్తున్నారు. కానీ టాలీవుడ్ లో కాస్త స్టార్ డైరెక్టర్ లుగా పేరు తెచ్చుకున్న వారు మాత్రం బాగా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్ననే బెంగాల్ టైగర్ తో రవితేజ కి మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ఇంకా తన తదుపరి సినిమా ఏంటో చెప్పడం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరవాత మొన్ననే ఎక్స్ ప్రెస్ రాజా తో హిట్ ఇచ్చిన మేర్లపాక గాంధీ కూడా తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు

 

 

రాం చరణ్ - నాగ చైతన్య లకి స్టోరీ లు అయితే చెప్పాడు కానీ ఇప్పటి వరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.గబ్బర్ సింగ్ తో తనకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ మొన్ననే సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ తో కమర్షియల్ గ ఓకే అనిపించుకున్నాడు. కానీ ఈయన కూడా తరవాత సినిమా ఏంటి అంటే నీళ్ళు నమిలే పరిస్థితి. ఉయ్యాలా జంపాలా తో డైరెక్టర్ గా సూపర్ హిట్ అయిన ' విరించి వర్మ' కూడా ఖాళీ గా కనిపిస్తున్నాడు.

 

 

 

 రన్ రాజా రన్ తో డెబ్యూ డైరెక్టర్ గా సూపర్ హిట్ కొట్టిన సుజీత్ తరవాత సినిమా ప్రభాస్ తో తీద్దాం అని ఎదురు చూస్తున్నాడు. ఈ గ్యాప్ లో వేరే హీరోతో తీయకూడదు అని కంకణం కట్టుకున్నడో ఏమో మరి. ఇలా టాలెంటెడ్ సరకు అంతా బాగా ఖాళీగా ఉంటే ఇండస్ట్రీ లో మూస సినిమాలు రాక మరేం ఒస్తాయి ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: