త రెండు రోజులుగా చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ పెళ్ళి వార్తలు మీడియాలో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు తోడుగా అల్లు కుటంబ వారసుడు అల్లు శిరీష్ కూడ పెళ్ళి కొడుకు కాబోతున్నాడా అన్న సంకేతాలు వస్తున్నాయి. 

దీనికి కారణం స్వయంగా అల్లు శిరీష్ తన ట్విటర్ ఎకౌంట్ లో పెట్టిన ట్విట్. ‘నాకు త్వరలోనే శ్రీమస్తు శుభమస్తు, మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’  అంటూ అల్లు శిరీష్ భావయుక్తంగా ఒక ట్వీట్ చేశాడు.  అంతేకాదు మిగతా విషయాల్ని త్వరలోనే చెబుతాను అని అంటున్నాడు. 

ఈ ట్విట్ బట్టి శిరీష్ పెళ్ళి కుదిరిందా అంటూ అప్పుడే ఫిలింనగర్ లో చర్చలు మొదలైపోయాయి. అయితే మరి కొద్దిమంది అల్లు శిరీష్ ట్విట్ కు వేరే అర్ధాలు చెపుతున్నారు. ఇతడు నటిస్తున్న  కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ ‘శ్రీమస్తు శుభమస్తు’ అయ్యి ఉంటుందని అందుకే అలా ట్వీట్ చేసి ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ తన పెళ్ళి గురించి మరో నాలుగేళ్ల వరకు అటువంటి ఆలోచనలే లేవు అని చెప్పాడు. 

అయితే ఇంత తొందరగా శిరీష్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడా ? లేదంటే  పరుశురామ్ దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థ పై చేస్తున్న లేటెస్ట్ సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా ? అనే విషయాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాలి. అయితే శిరీష్ ట్విట్ ప్రస్తుతానికి సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: