అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో కంటే ఒక్క బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ కి భారీ రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత బాగా కష్టపడినప్పటికీ కేవలం 2 కోట్ల రూపాయల లోపే రెమ్యునరేషన్ ని చేజిక్కించుకోగలరు. అంతకు మించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఛాన్స్ లేదు. కానీ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు వేరు. హీరోయిన్స్ కి బాగా డిమాండ్ ఉంటే…మినిమం 5 కోట్ల రూపాయల నుండి 15 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ కింద తీసుకుంటారు.


ప్రస్తుతం ఓ క్రేజీ ఫిల్మ్ కోసం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ అనుష్క శర్మ, దాదాపు 12 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద తీసుకుంది. ఇదంతా అనుష్క శర్మ అప్ కమింగ్ ఫిల్మ్ విషయంలో జరుగుతుంది. అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ‘సుల్తాన్’ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తుంది. గతంలో ఈ పాత్రకి దీపికా పడుకొనే, పరిణితి చోప్రా వంటి వారిని సంప్రదించారు.


కానీ ఫైనల్ గా చిత్ర యూనిట్ అనుష్క శర్మని కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే అనుష్క ఈ మూవీ కోసం కసరత్తులను మొదలు పెట్టింది. అనుష్క ఈ మూవీలో ఫిట్ గా కనిపిపంచటమే కాకుండా, కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ ని కూడ తీసుకోవాలి. ప్రస్తుతం అనుష్క ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ ని తీసుకుంటుంది. ఇక ఈ మూవీని 2016వ సంవత్సరం ఈద్ పండుగ కానుకగా థియోటర్స్ ని హిట్ చేయనుంది.


అయితే సుల్తాన్ మూవీలోని తన పాత్ర కోసం అనుష్క ఎంతో కష్టపడాల్సి ఉండటంతో…తను 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసింది. అందుకు నిర్మాతలు సైతం అనుష్కకి అంత రెమ్యునరేషన్ ని ఇవ్వటానికి రెడీ అవ్వటంతో ఈ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ లో భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్న వారిలో అనుష్క శర్మ ఒకరు.



మరింత సమాచారం తెలుసుకోండి: