సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'కబాలి'.. పా.రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొన్నటిదాకా మలేషియాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొచ్చాడియన్, లింగ ఫ్లాపుల తర్వాత రజిని నుండి వస్తున్న సినిమా కావడం చేత ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకున్నాయి.


రజిని కూడా ఈ సినిమా గ్యారెంటీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. రాధికా ఆప్టే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాషా తర్వాత రజిని మాఫియా బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ లో బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా గురించి రిలీజ్ అయిన పోస్టర్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంటే రీసెంట్ గా కబాలి నుండి రజిని మరో లుక్ రివీల్ అయ్యింది.


ఇక దీనితో పాటుగా శంకర్ రోబో 2.0 కి కూడా రజిని సమన్యాయ చేస్తున్నాడు. రోబో క్రియేట్ చేసిన వండర్స్ ను రిపీట్ చేసేలా మరోసారి శంకర్ తో కలిసి రోబో 2.0 ని అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు మరో క్రేజ్ తీసుకు వచ్చిన అంశం బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కూడా రజిని ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది.


ఇప్పటికే సమ్మర్ రేసులో స్టార్ హీరోల సినిమాలు వరుసెంట రిలీజ్ అవుతుంటే.. కబాలి కూడా సమ్మర్ రేసులో దించుతున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్నా మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తుండటం విశేషం. సినిమాలో మాఫియా డాన్ గా కనిపిస్తున్న రజిని మరో సారి రికార్డుల పరంపరను కొనసాగించడం ఖాయం అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: