ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇస్తున్న హీరోయిన్స్ వెంటనే గ్లామర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవేళ గ్లామర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, ఆ హీరోయిన్స్ కి అవకాశాలు రావటం అనేది జరగని పని. అందుకే నేటి హీరోయిన్స్ కచ్ఛితంగా గ్లామర్ ని చూపించేందుకు ఏ పరిస్థితుల్లో అయిన సిద్ధంగా ఉండాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ కి చెందిన క్రేజీ హీరోయిన్ అవకాశాలు లేక గ్లామర్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కన్నడ బ్యూటీ హరిప్రియ ప్రస్తుతం గ్లామర్ పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కెరీర్‌ ప్రారంభంలో ఈ బ్యూటీ అందాల ఆరబోత అంటే ఆమడ దూరంలో ఉండేది. తకిట తకిట, పిల్ల జమీందార్‌ వంటి సినిమాల్లో నటించిగా..ఆ మూవీలు సక్సెస్ సాధించినప్పటికీ హరిప్రియకి మాత్రం ఎక్కడా అవకాశాలు పెరగలేదు. దీంతో ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో తన సత్తాని చాటాలని చూస్తుంది. తన దగ్గర ఉన్న గ్లామర్ క్రేజ్ ని ఉపయోగించుకోవాలని చూస్తుంది.


తాజాగా ఈ బ్యూటీ నటిస్తున్న నీర్‌ డోస్‌ అనే కన్నడ సినిమా ఏకంగా బికిని లుక్స్ తో అధరగొట్టనుంది. విజయ్‌ ప్రసాద్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హరిప్రియ తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీలో తన హాట్ లుక్స్ బయటకు వచ్చాయి. ఈ స్టిల్స్ ని చూసిన ప్రేక్షకులు, అలాగే ఇండస్ట్రీ వారు ఒక్కసారిగా హరిప్రియ అందాలకు షాక్ అవుతున్నారంట.


సిగరెట్‌ తాగుతూ.. మందు కొడుతూ, స్విమ్మింగ్‌ ఫూల్‌  దగ్గర హాట్ హాట్ గా కనిపిస్తున్న స్టిల్ ఒకటి ప్రచారంలో ఉంది. ఇక హరిప్రియ అందాలను చూపించటానికి రెడీగా ఉండటంతో టాలీవుడ్ లోనూ ఈ బ్యూటీకి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: