నాచురల్ స్టార్ నాని క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. ఒక సంవత్సరం కాలం పాటు ఎన్నో అపవాదాలు మూటకట్టుకున్న నాని ఎట్టకేలకు ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్ సినిమాల సక్సెస్ లతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. భలే భలే మగాడివోయ్ నాని సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ కూడా నాని ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చి పడేలా చేసింది.  


అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కృష్ణగాడి సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని నాని కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచేలా పరుగులు తీస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో నిర్మించబడ్డ ఈ సినిమాలో మెహెరిన్ హీరోయిన్ గా నటించింది. కథ కథనాల్లో కొత్తదనంతో పాటుగా నాని మార్క్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమా హిట్ నాని కెరియర్ కు మరింత బూస్టప్ ఇచ్చింది.


అయితే కెరియర్లో హిట్ కొడితే సాధారణంగా హీరోలు రెమ్యునరేషన్ పెంచడం మాములే.. అదే దారిలో ఇప్పుడు నాని కూడా మరో 5 కోట్లు రెమ్యునరేషన్ పెంచాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే టాక్ వచ్చింది. కాబట్టి నాని పారితోషికం పెంచడంలో కూడా తప్పులేదంటూ చెబుతున్నారు.


ఇక ఇదే రేంజ్ కొనసాగిస్తే నాని స్టార్ హీరో అవడం ఖాయమే.. ప్రస్తుతం కృష్ణగాడి వీర ప్రేమగాథ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని తనకు మొదటి సినిమా హిట్ ఇచ్చిన అష్టా చమ్మ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. మరి పెంచిన రెమ్యునరేషన్ తో నాని దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులను సాటిస్ఫై చేస్తాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: