అనునిత్యం ఎదో ఒక సంచలనాలు చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఈమధ్యనే తన సినిమా జీవితానికి సంబంధించిన విశేషాల పై ‘గన్స్ అండ్ థైస్’ అన్న పుస్తకం వ్రాసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో వర్మ తాను దర్శకత్వం వహించిన హీరోయిన్స్ పై అనేక సంచలన కామెంట్స్ చేసాడు. 

ఈ పుస్తకంలో ‘ఉమెన్ ఇన్ మై లైఫ్’ అనే చాప్టర్‌లో హీరోయిన్స్ తో తనకు ఉన్న రిలేషన్స్‌ ను రివీల్ చేశాడువర్మ. మొట్టమొదటిగా వర్మ తన అందాల రాశి శ్రీదేవి గురించి కామెంట్ చేస్తూ   ఆమె అందానికి తను ఎలా పడిపోయిందీ, ఆమెతో ‘క్షణంక్షణం’ సినిమా చేసినప్పటి రోజులను గుర్తుకు చేసుకుంటూ ఫాంటసీ, రియాల్టీ‌కి ఉన్న తేడా తనకు ఎలా తెలిసింది అన్న విషయాన్ని ప్రస్తావించాడు వర్మ. 

ఇక బాలీవుడ్ బ్యూటీ తనకు సన్నిహితురాలు అయిన ఊర్మిళ గురించి కామెంట్ చేస్తూ తనలో నటుడ్ని నిద్రలేపిన హాట్ బ్యూటీ ఊర్మిళ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ‘రంగీలా’ లో ఆమె అందాన్ని ప్రతి ఫ్రేమ్‌ లోను ఆమె  అందాన్ని బంధించాననీ చెప్పుకొచ్చాడు వర్మ. 

అంతేకాదు ఊర్మిళ ఫిగర్ చూస్తే మైండ్ స్ట్రక్ అయిపోతుందని ఆమె పై హాట్ కామెంట్స్ చేసాడు. ఊర్మిళ తరువాత వర్మ తెగ మనసుపడ్డ హీరోయిన్ ఆంత్రమాలి అని చెపుతూ ‘మస్త్’ షూటింగ్‌లో ఈమె యాక్టింగ్ చూసి ‘కంపెనీ’ సినిమాలో కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు వర్మ. హీరోయిన్లు అందరూ బాగానే ఉంటారనీ కానీ ఫ్రేమ్‌లో ఫిక్స్ చేసే విషయంలోనే సమస్యలొస్తాయని ఆ సమస్యలు వచ్చినప్పుడు వారిని అందంగా ఎలా చూపించాలి అన్న టెన్షన్ తనకు చాల ఎక్కువ అని తన మనసులోని మాట బయటపెట్టాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: