ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వేలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు తన భార్య జయలక్ష్మితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రేమ అనే పదం కేవలం యువతీ యువకులకే సంబంధించింది కాదని ప్రేమ అంటే ‘నమ్మకం’ అంటూ కామెంట్స్ చేసారు దర్శకుడు కె. విశ్వనాథ్. 

ప్రేమ హృదయాంతరాల నుంచి రావాలి కాని కేవలం సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే వేలంటైన్స్ డే, మథర్స్ డే, ఫాదర్స్ డే, మ్యారేజ్ డే అంటూ ఎందుకు జనం హడావిడి చేస్తారో తనకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని సంచలన కామెంట్స్ చేసారు విశ్వనాథ్. మనలో ఎదుటి మనిషి పట్ల ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేసినా తప్పు అనిపించదు అని సెటైర్లు వేసాడు విశ్వనాథ్. తమ మధ్య ఇన్ని సంవత్సరాలు అయినా ఎటువంటి గొడవలు రాకుండా కలిసి ఉండటానికి గల కారణం తమ మధ్య ఉన్న నమ్మకం అని అంటూ నేటితరానికి అనేక విషయాల పై తన సూచనలు ఇచ్చాడు విశ్వనాథ్. 

‘ప్రేమ’ అంటే త్యాగం –  ‘ప్రేమ’ అంటే సాహసం అంటూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటున్న ఈ సందర్భానికి సంబంధించి ఒక ప్రముఖ గిఫ్ట్ డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆ శక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈరోజు మన భారతదేశంలో ప్రతి యువకుడు సగటున 740 రూపాయలు ఖర్చు పెడతారట. ఇక అమ్మాయిలు అయితే సగటున 670 రూపాయలు ఖర్చు పెడతారని ఈ సర్వే చెపుతోంది. ఈరోజు చాలామంది ప్రేమికులు గులాబీలతో తమ ప్రేమను వ్యక్తం చేస్తే ఆ తరువాత స్థానంలో చాక్లెట్స్ ఇచ్చి ప్రేమను వ్యక్తం చేసే యువతీ యువకులు అధికం అన్న ఆశక్తికర విషయాన్ని బయట పెట్టింది ఈ సర్వే. వజ్రాల నుండి గులాబీ పువ్వుల వరకు ఒకరికొకరు ప్రేమతో ఇచ్చి పుచ్చుకునే ఈరోజు కొన్ని వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది అంటే ఎవరూ ఊహించలేని నిజం..



మరింత సమాచారం తెలుసుకోండి: