ఇంకా 1 నేనొక్కడినే - ఆగడు సినిమాల దెబ్బకి దివాళా తీసిన 14 రీల్స్ నానీ సినిమా ' కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమా సమయం లో చాలానే టెన్షన్ పడింది. ఈ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్ లో తీయడం మొదలెట్టారు కానీ సినిమా పూర్తి అయ్యే సరికి పెద్ద సినిమా అయిపొయింది. పబ్లిసిటీ దగ్గర చచ్చినట్టు చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది వీళ్ళకి. అసలే ఈ సినిమా తరవాత బాలకృష్ణ తో 14 రీల్స్ వారు 100 వ సినిమా తీయాల్సి ఉంది.

 

 

 ఈ సినిమా తేడా కొడితే దానికి బాలయ్య రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమా హిట్ అయితే వందవ సినిమాకీ ఈ బ్యానర్ కీ ఒక సరైన విలువ ఉంటుంది అనేది అందరి ఫీలింగ్ సో చాలా జాగ్రత్తగా తీసారు సినిమాని. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడం, రెండు రోజుల కలక్షన్ లూ అదిరిపోవడం తో హమ్మయ్య అనుకున్నారు. ఈ సినిమా 14 రీల్స్ కి కొత్త ఊపిరిలు ఊదింది. ఈ బలంతో వారి మరింత ఉత్సాహంగా బాలయ్య వందవ సినిమా నిర్మాణం చెయ్యాలి అనుకుంటున్నారు. ఇది నిజంగా పాజిటివ్ విషయం.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: