ఒక్క సినిమాలో చాన్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భామలున్న ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఊహించని విధంగా అవకాశాలను కొట్టేస్తుంది. అందుకే మిగతా భామలందరు ఆమె మీద గుస్సుగా ఉన్నారు. తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే రెండు సినిమాలను చేజిక్కించుకున్న భామ ఇప్పుడు కోలీవుడ్లో కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది.


ఇంతకీ ఎవరా భామా.. అంటే ఇంకెవరు ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అనేస్తున్నారు. తెలుగులో త్రివిక్రం దర్శకత్వంలో అ..ఆ సినిమా చేస్తున్న ఈ అమ్మడు ప్రేమం రీమేక్ మజ్ఞులో కూడా తన పాత్రకు తానే న్యాయం చేస్తుందని సెలెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమా ఆఫర్ కూడా లైన్లో ఉందని టాక్.. అయితే ఇదిలా ఉంటే కోలీవుడ్ నుండి కూడా అమ్మడికి భారీ ఆఫర్ తలుపు తట్టిందట.


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా కోడిలో అవకాశం దక్కించుకుందట అనుపమ. ముందు ఈ పాత్రకు షామిలీని అనుకున్నా ఆమెను కాదని ఇప్పుడు ఈ ఆఫర్ అనుపమకు ఇస్తున్నట్టు కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండా అమ్మడు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. అమ్మడు దక్కించుకుంటున్న సినిమా ఆఫర్లను చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లు కోవడం ఖాయం.


అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండా అనుపమా చేస్తున్న ఈ మ్యాజిక్ ఏంటి అని అందరు ఆమెను బాగా అబ్సర్వ్ చేస్తున్నారు. ప్రేమం ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయిన కారణం చేత అమ్మడికి తెలుగు, తమిళ భాషల్లో వరుసెంట ఆఫర్లు ఇస్తున్నారు. మరి వచ్చిన ఆఫర్లన్ని సైన్ చేస్తున్న అనుపమ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: