ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరో  ఎవరంటే నాని అని ముక్తకంఠంగా చెప్పేస్తారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫాంలో ఉన్న నాని రీసెంట్ కృష్ణగాడి వీర ప్రేమ గాథలో మరోసారి తన సత్తా చాటాడు. ఇక తను చేస్తున్న తర్వాత సినిమాల మీద మరింత బరోసా ఏర్పడనుంది. ప్రస్తుతం తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు నాని.


అష్టా చమ్మ సినిమాతో హీరోగా అవకాశం ఇచ్చిన డైరక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటితో చేస్తున్న ఈ సినిమాలో నాని మరోసారి డ్యుయల్ రోల్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాకు 'ధమాకా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఒక షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది.


రీసెంట్ కృష్ణగాడి వీర గాథ హిట్ తో మరింత క్రేజ్ సంపాధించిన నాని ఈ డబుల్ ధమాకాలో కూడా మరో సెన్షేషన్ సాధించనున్నాడు.. ఆర్టిస్టిక్ సినిమాలను తీయడంలో మేటి అనిపించుకున్న మోహనకృష్ణ ఈ సినిమాను కూడా తన మార్క్ తో డైరెక్ట్ చేస్తున్నాడు. 50 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కూడా ఎంటర్టైనింగ్ తో సాగుతుంది.


నాని నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నారో కనిపెట్టి సరిగ్గా అలాంటి సినిమాలతో ఆకట్టుకుంటున్న నాని హ్యాట్రిక్ హిట్ జోష్ తో మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇలానే మరో రెండు మూడు సినిమాలు హిట్ కొడితే నానిని ఆపడం ఎవరి తరం కాకపోవచ్చు. మరి మోహనకృష్ణ డబుల్ ధమాకాలో నాని మరోసారి ధమాకా సే ల్ చేస్తాడో లేదో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: