దిల్ రాజు అంటే మంచి నిర్మాతనే అందరికి తెలిసిందే.. ఇంకా చెప్పాలంటే నైజాం లో బడా డిస్ట్రిబ్యూటర్ అంతే.. అయితే సినిమా భవితవ్యాన్ని తేల్చే వ్యక్తిగా దిల్ రాజు రెండు ఆకులు ఎక్కువే చదివాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఓ పక్క సినిమాల నిర్మాణం మరో పక్క డిస్ట్రిబ్యూషన్ ఇలా సమన్యాయం చేసుకుంటూ పోతున్న రాజు ఓ నిర్ణయం అందరిని షాక్ కు గురి చేస్తుంది.


ఓ సినిమా చూసి అది హిట్టా ఫట్టా అని తేల్చే రాజు గారు బెంగుళూర్ డేస్ సినిమా నిర్ణయంలో సూపర్ అనిపించేసుకుంటున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమాను ముందు తెలుగు తమిళ్ బైలింగ్వల్ సినిమా చేద్దామనుకున్నారు. అక్కడ పివిపి ఇక్కడ దిల్ రాజు నిర్మాతలుగా చేద్దామని డిసైడ్ అయ్యారు. 


కాని ఎక్కడ కొట్టిందో ఏమో దిల్ రాజు ఆ సినిమా తెలుగులో చేయకుండా కేవలం పివిపితో తమిళ్ లో మాత్రమే చేసేదాకా వెయిట్ చేశాడు. అయితే రిలీజ్ అయిన ఆ బెంగుళూర్ డేస్ అదేనండి బెంగుళూర్ నాట్కల్.. అక్కడ దాదాపు ఫ్లాప్ అనేస్తున్నారు. సినిమాకు పెట్టిన డబ్బులు రావడం కష్టమేనని వాపోతున్నారు బయ్యర్లు. 


అయితే ఈ విషయం ముందే పసిగట్టే దిల్ రాజు ఆ సినిమాను తెలుగులో తెరకెక్కించలేదని టాక్. తెలుగులో ఇదవరకు వచ్చిన ఫీల్ గుడ్ మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా కూడా ఎంత బాగున్నా  థియేటర్స్ లో ఆ సినిమా ఆడలేదు. అందుకే ఇప్పుడు ఆ తమిళ్ సినిమానే ఇక్కడ డబ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.   


మరింత సమాచారం తెలుసుకోండి: