సూపర్ స్టార్ మహేష్ అంటే ఎంతటి క్రేజో మాటల్లో చెప్పలేం.. సినిమా సినిమాకు తన మీద అభిమానం రెట్టింపయ్యేలా చేస్తున్న మహేష్ ప్రస్తుతం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. బ్రహ్మోత్సవం అంటూ వస్తున్న సాఫ్ట్ గా వస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ అంశాలు కూడా సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడట.


ఇక సినిమాలో కుటుంబ బంధాలతో కూడా అభిమానులను కంటతడి పెట్టించేస్తాడట మన సూపర్ స్టార్. ప్రస్తుతం ఓవర్సీస్లో బాద్షా లా కొనసాగిస్తున్న మహేష్ ట్రెండ్ మరో సంచలనానికి మరెంతో దూరంలో లేడు. టాప్ టెన్ ఓవర్సీస్ హిట్స్ లో మహేష్ మూడు సినిమాలు ఉండటం విశేషం. అయితే ప్రస్తుతం తన సినిమా అప్డేట్స్ విషయంలో అభిమానులను దూరంగా ఉన్న మహేష్ ఇప్పుడు అప్డేట్స్ అన్ని ఇచ్చే విధంగా కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాడట.


తన సినిమాల విషయాలతో ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండేలా చూస్తున్నాడట మహేష్. చేసేది ఎలాగు ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. సినిమా కథ ఇది అంటూ క్లూలు ఇస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా కాగానే మురుగదాస్ సినిమా షురు చేస్తున్నాడు మహేష్.


ఫ్యాన్స్ కు దగ్గరంగా ఉండే క్రమంలోనే ఎవరు ఏ ఫంక్షన్ కు పిలిచినా న్యూస్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం రెండు మూడు హిట్స్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న కుర్ర హిరోలను ఎంకరేజ్ చేసే విషయంలో కూడా మహేష్ ముందడుగు వేస్తుండటం విశేషం. మరి ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ లాంటి ఈ న్యూస్ తో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: