సినిమా ఇండస్ట్రీలో ఎంటర అయిన నటీమణులు చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులర్ కావాలని చూస్తుంటారు..అందుకోసం వివాహం చేసుకోవడం తమ కెరీర్ కి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అప్పట్లో హీరోయిన్లు తమ కెరీర్ బాగానే సాగుతున్న వివాహం చేసుకొని మంచి కుటుంబంతో హుందాగా జీవించారు. ఇక కొంత మంది వివాహం చేసుకోకుండా సహజీవనం, వైరాగ్యంతో జీవితాలు అస్తవ్యస్థం చేసుకున్నారు. ఇక ఇప్పటి హీరోయిన్ల విషయానికి వస్తే.. థర్టీ ప్లస్ వచ్చినా అబ్బే ఇప్పుడే పెళ్లా అంత అవసరం ఏముందీ జీవితంలో ఇంకా సెటిల్ అవ్వాలి అంటున్నారు.

 సినిమా ఇండస్ట్రీలో చాన్స్ రావడమే మహా గొప్ప అందులోనూ మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ వద్దు బాబోయ్ అంటున్న పెద్దల బలవంతం మేరకు పెళ్లి చేసుకున్న మున్నాళ్లకే నాకు ఈ మొగుడు వద్దూ అంటూ విడాకులు ఇచ్చేసింది ఈ నటీమణి. మళియాలంలో మంచి కెరీర్ తో సాగుతున్న భామ కావ్యా మాధవన్. ఆ మద్య పెద్దలు మంచి సంబంధం అని నచ్చజెప్పడంతో తప్పని సరియై పెళ్లి చేసుకుందట..తర్వాత ఆ మొగుడు చీటికి మాటికి అనుమానిస్తూ..నిందలు వేస్తూ మానసికంగా చాలా ఇబ్బందులకు గురిచేసేవాడట. అందుకే ముక్కూ మొఖం తెలియని వారిని పెళ్లి చేసుకొని ఇబ్బందలు పడే కంటే మనసుకు మెచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటర్ అంటుందీ ఈ భామ.


కావ్యా మాధవన్


ఈసారి మాత్రం నా గురించి బాగా తెలిసిన వాడ్ని పెళ్లి చేసుకుంటానని అంటోంది కావ్యా మాధవన్ . త్వరలోనే రెండో పెళ్ళికి సిద్దమౌతున్న ఈ భామ హీరో దిలీప్ తో జోరుగా ప్రేమ వ్యవహారాలను నడిపిస్తోందని యమా జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ అబ్బే ! దిలీప్ జస్ట్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అని అంటోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: