తెలుగు ఇండస్ట్రీలో మహానటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా ఇప్పటికే అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి అగ్రహీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కూతుళ్ల కొడుకులు  సుమంత్, సుశాంత్ లు హీరోలుగా వచ్చారు..కానీ సరైన హిట్ రాక ఫామ్ లోకి రాలేక పోయారు. ఇక నాగార్జున తనయులు నాగచైతన్య,అఖిల్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  అయితే నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్ గతంలో వచ్చన ‘కరెంట్’ చిత్రం ఒకే అనిపించినా తర్వాత వచ్చిన సినిమాలు విజయవంతం కాలేదు. 

తాజాగా సుశాంత్, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రలలో ‘ఆటాడుకుందాం ..రా’ అనే చిత్రం తెరకెక్కుతుంది.   ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ఈ చిత్రం అంతా కామెడీతోనే నిండినట్లు కనిపిస్తుంది. టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ పై బ్రహ్మానందం, సుశాంత్,సోనమ్ భజ్వా,వెన్నెల కిషోర్ ల మద్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లో నవ్వుల వర్షం కురిపించే విధంగా ఉండబోతుంది..అయితే ఈ చిత్రం మన హీరో మాత్రం అందరితో ఒక్క ఆట ఆడుకుంటున్నట్టు కన్ఫామ్ అయ్యింది. దులో సుశాంత్ ఢిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నారు.

 ‘ఆటాడుకుందాం ..రా’ చిత్రంలో ఓ దృశ్యం


కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన జి. నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్రహ్మనందం, వెన్నెల కిషోర్, పృధ్వీ రాజ్, మురళీ శర్మ లు సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించి సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో సందడి చేయనున్న ఆటాడుకుందాం .. రా మూవీ టీజర్‌ మీరూ చూసి ఎంజాయ్ చేయండి..!


మరింత సమాచారం తెలుసుకోండి: