గణితం లో మనం చిన్నప్పుడు  ఎక్కువగా విన్న పేరు శ్రీనివాస రామానుజన్, మనందరికీ ఈ పేరు సుపరిచితం. ఈ మాథ్స్ మేధావి మీద ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో ఒక సినిమా తీసారు. దాని పేరు 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ'. అనంతం గురించి తెలిసిన వ్యక్తి అని తెలుగు మీనింగ్  చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరం ఆ సినిమా అక్కడ విడుదల అయ్యింది చాలా పెద్ద సక్సెస్ కూడా అయ్యింది. 19 శతాబ్దం ఆఖరి వ్యక్తి శ్రీనివాసన్, ఇరవయ్యవ శతాబ్దం లో అత్యంత ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్తల్లో అగ్రస్థానం లో ఉంటాడు ఆయన. ఎన్నో సిద్దాంతాలు రూపొందించి గణిత శాస్త్ర గతిని ప్రగతి ని మార్చిన మహాను భావుడు. అలాంటి వ్యక్తి మీద సినిమా తీయాలి అని మనవాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు కానీ హాలీవుడ్ వారు మాత్రం సినిమా తీసారు.

 

 

 

 

కనీసం మనోళ్ళకి ఆయన మీద డాక్యుమెంటరీ అయినా తీసే యావ రాలేదు అది వేరే విషయం. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ విడుదల కి సిద్దం అవుతోంది. శ్రీనివాస రామానుజన్ గా దేవ్ పటేల్ నటించాడు, అతనే నండీ స్లం డాగ్ మిలియనీర్ సినిమాలో నటించిన హీరో. ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు, మంచి రెస్పాన్స్ కూడా ఒస్తోంది. అయితే ట్రైలర్ కి రెస్పాన్స్ తో పాటు అలాంటి వ్యక్తి మీద మనం సినిమా తీసుకోలేక పోయాం అనే సిగ్గు కూడా వేసే అవకాశం బాగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: