" భరత దేశానికి క్రికెట్ ఆట ఒక మతం అయితే అందులో దేవుడు సచిన్ టెండూల్కర్ " ఈ సెంటెన్స్ మనం చిన్నప్పటి నుంచీ వింటున్నాం , చదువుతున్నాం. ఈ భారత దేశం లో క్రికెట్ కి అంతులేని క్రేజ్ ని తీసుకుని ఒచ్చింది సచిన్ టెండూల్కర్ మాత్రమె. అంతటి సచిన్ చరిత్ర ని ఇప్పుడు సినిమా గా తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం అజర్, ధోనీ ల మీద కూడా బయోపిక్ లు అంటూ సినిమాలు తెరకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు రాబోతున్న సచిన్ ఏ బిలియన్ ద్రీంస్ కి ఒక స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ సినిమా లో సచిన్ తన పాత్ర తానే చేస్తున్నాడు. తన బయోపిక్ లో తాను నటించే ఛాన్స్ అందరికీ రాదు కదా మరి.

 

 

ఈ సినిమా ద్వారా సచిన్ సినిమా హీరో గా మారబోతున్నాడు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. పూర్తిగా మాసిపోయిన ఓ ప్యాంట్ ప్యాడ్స్ కట్టుకుని వస్తున్న సచిన్ కనిపిస్తాడు. యాభై రోజుల ట్రైనింగ్ , ఒకే ఒక జత బట్టలు - ఇదీ కథ అంటూ ఇచ్చిన కాప్షన్ చాలా బాగుంది. ఏప్రిల్ 14 న సచిన్ టీజర్ విడుదల చెయ్యాలని చూస్తున్నారు. సచిన్ ట్విట్టర్ లో తన ఫస్ట్ లుక్ తో పాటు సంతోషాన్ని కూడా షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ షారూక్ ఖాన్ ట్వీట్ చేసాడు. లండన్ కి చెందిన జేమ్స్ ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: