‘సర్దార్ గబ్బర్ సింగ్’  సినిమాను కొనుక్కున్న బయ్యర్స్ కు శాప గా మారడంతో ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తి అయ్యేసరికి దాదాపు 40 కోట్ల భారీ నష్టాలను మూట కట్టుకుని ఈ సంవత్సరపు అతి పెద్ద సూపర్ ఫ్లాప్ గా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అనే సంకేతాలు చాల స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు విపరీతమైన టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమా హిందీ డబ్బింగ్ కు దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టిన ఈరోస్ సంస్థకు కేవలం ఇప్పటికి బాలీవుడ్ లో ఈ సినిమా ద్వారా ఈరోస్ కు వచ్చిన షేర్ 75 లక్షలు అంటే ఈ సినిమా ఎంత ఘోరమైన ఫ్లాప్ గా మారిందో అర్ధం అవుతుంది. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను నిర్మిoచిన శరత్ మరార్ పవన్ కళ్యాణ్ లకు ఈ మూవీ జరిగిన బిజినెస్ ద్వారా 45 కోట్ల లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ ఈరోస్ సంస్థతో చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాకు భయంకరమైన లాసులు వస్తే ఈరోస్ సంస్థకు కొంత మొత్తంలో ఆ నష్టాలను భరిస్తామని పవన్ మరియు శరత్ మరార్ లు ఈరోస్ సంస్థకు ఈ సినిమా విడుదలకు ముందే మాట ఇచ్చినట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈరోస్ సంస్థ వారిచ్చిన మాట ప్రకారం నష్టాలలో కొంత శాతం భరించమని పవన్ శరత్ మరార్ లపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఫిలింనగర్ గాసిప్. 

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఈ సినిమాను మన ఇరు రాష్ట్రాలలోను కొనుక్కున్న బయ్యర్లు కూడ భారీ నష్ట పోవడంతో తమ నష్టాలకు కూడ ఎంతో కొంత సహాయం చేయమని పవన్ ను కలిసి వారి భాధలు చెప్పుకోవాలని కొంతమంది బయ్యర్లు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లు గా మారినప్పుడు రజినీకాంత్ అక్కడి బయ్యర్లను ఆదుకున్న విధంగా తమను కూడ ఆదుకోవాలని సర్దార్ బయ్యర్లు కోరుతున్నట్లు టాక్. ప్రత్యక్ష రాజకీయాలలోకి అతి త్వరలో రాబోతున్న పవన్ కళ్యాణ్ ఈ సున్నితమైన సమస్యను ఎలాగ పరిష్కరించి అందరి మన్నలను పొందుతాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: