తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ మద్య బాగానే కలెక్షన్లు రాబడుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ రోజు భారత దేశంలో రిలీజ్ అయిన  ద జంగిల్ బుక్ రికార్డులు తిరగరాస్తోంది. వాస్తవానికి జంగిల్ బుక్ తో భారతీయులందరికీ దూరదర్శన్ రోజుల నుంచీ అనుబంధం ఉంది. ముఖ్యంగా అందులో మోగ్లీ పాత్రకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.. అపట్లో చిన్న పిల్లలకు ఆ పేరు పెట్టుకున్న వారు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు  హాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమాను ఇండియన్ సినిమాలా భావించి ఆదరిస్తున్నారు.

ద జంగిల్ బుక్


టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్ణిస్తున ఈ సమయంలో మరో అద్భుత దృశ్యరూపమే ద జంగిల్ బుక్. సీజీఐ టెక్నాలజీతో ఆ ఫిల్మ్ డైరక్టర్ జాన్ ఫవ్రూ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. హీరో మోగ్లీ తప్ప మిగతా అన్ని క్యారక్టర్లు కంప్యూటర్ కళా చిత్రాలే. అంటే సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ.  పాంథర్ భగీర, టైగర్ షేర్‌ఖాన్, ద బియర్ బాలూ, ద పైతాన్ కా, చింపాంజీ కింగ్ లూయి, మోగ్లీని పెంచి పోషించిన నక్కలు. ఆ మూగ జీవాలకు సీజీఐ టెక్నిక్ ప్రోణం పోసింది.

ద జంగిల్ బుక్


జాన్‌ ఫావ్రో దర్శకత్వంలో నీల్‌సేథి ప్రధాన పాత్రధారిగా గత శుక్రవారం విడుదలైన 'ది జంగిల్‌ బుక్' మంచి వసూళ్లు రాబడుతోంది. తొలిరోజే రూ. 9.76 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.ఇక అక్షయ్‌కుమార్‌ హీరోగా 2016లో విడుదలైన 'ఎయిర్‌లిఫ్ట్' తరువాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా 'ది జంగిల్‌ బుక్‌' నిలించింది. ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు.

ద జంగిల్ బుక్


సినిమా విడుదలైన వారం రోజుల్లో 74.08 కోట్ల రూపాయలను వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధమవుతోంది. మొదటి రోజు సులభంగానే టిక్కెట్లు దొరికినా, రోజులు గడిచేకొద్దీ టిక్కెట్లు దొరకని పరిస్థితి కనబడుతోంది. మన దేశంలో వంద కోట్లను ఈజీగా కొల్లగొట్టేస్తుందనేది ట్రేడ్ వర్గాల అంచనా..


మరింత సమాచారం తెలుసుకోండి: