తెలుగు సినిమా స్థాయినే కాదు ఇండియన్ సినిమా స్టామినాను చాటి చెప్పిన బాహుబలి సినిమా మొదటి పార్ట్ కే అభిమాన నీరాజనాలు అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా సెకండ్ పార్ట్ షూట్లో ఉండగా వేసవి తాకిడికి షూటింగ్ ఓ నెల రోజులు సెలవిచ్చాడు జక్కన్న. ఇకపోతే ఈ సినిమా రెండో భాగం ఎలాగైనా 2017 ఏప్రిల్ 14 తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. 


బాహుబలిలో ఫైట్ సీన్ :


అయితే హాలీవుడ్ సినిమా అవతార్ కూడా పార్ట్ 2 రెడీ అవుతుంది. జేమ్స్ కామెరూన్ ఆ సినిమా రెండో పార్ట్ ను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. అవతార్ సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. డబ్బింగ్ సినిమాగా అయినా అవతార్ ఇండియన్ స్క్రీన్స్ పై భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు బాహుబలి పార్ట్ 2, అవతార్ -2 ఓకేసారి రిలీజ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.  


జేమ్స్ అవతార్-2 ను 2017 ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉండగా ఇప్పటికే బాహుబలి-2 ఏప్రిల్ 14, 2017 అని డేట్ ఫిక్స్ చేశాడు జక్కన్న అండ్ టీం.  సో ఈ లెక్కన అవతార్ వర్సెస్ బాహుబలి బాక్సాఫీస్ మీద పోటీ పడక తప్పేట్టు లేదు. గ్రహాంతర వాసులను గ్రాఫిక్స్ తో అద్భుత సృష్టిగా చూపించిన కామెరూన్ మరోసారి అంతకంటే అద్భుత లోకాన్ని అవతార్-2 కోసం సృష్టించనున్నాడట.   


అవతార్ సినిమాలో సీన్ :


మరి ఓ తెలుగు సినిమా ప్రపంచాన్ని కలక్షన్స్ తో గడగడలాడించిన హాలీవుడ్ సినిమాతో పోటీకి రాగలదా లేదో చూడాలి. బాహుబలి-2 కూడా ప్రపంచదేశాల్లో తమ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి-2 కోసం రాజమౌళి అండ్ టీం ఎంతో కష్టపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: