బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రీతి జింటా ఈ మధ్యనే పెళ్లి చేసుకుందని తెలిసిన వార్తే.. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి తన మెట్టినింటికి వెళ్లడం సాంప్రదాయమే. ఇక ఆ దారిలో ప్రీతి కూడా లాస్ ఏంజిల్స్ కు పయనమవుతుందట. తాను పూర్తిగా ఇండియాను వదిలి వెళ్లేందుకు సిద్ధమైందట. ఆ కారణం చేతనే తనకు ఇప్పటికి సినిమా అవకాశాలు వస్తున్నా వాటికి నో చెప్పేస్తుందట ఈ భామ. బీ టౌన్ హాట్ గాళ్ ప్రీతి జింటా లాస్ ఏంజిల్స్ కు చెందిన ఆర్ధిక విశ్లేషకుడు జీన్‌ గుడ్‌ఇనోని ఈ మధ్యనే వివాహం చేసుకుంది.       


ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈ భామ మెట్టినింటికి మఖాం మార్చబోతుందట. లాస్ ఏంజిల్స్ లోనే సెటిల్ అయ్యే ఆలోచనతో అక్కడే ఓ ఇళ్లు కూడా కొన్నారట. ఎంత పెద్ద స్టార్ అయినా పెళ్లి తర్వాత మెట్టినింటికి వెళ్లక తప్పదని ప్రీతి జింటాను చూసి మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇక పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా అన్న ప్రీతి జింటా నచ్చిన అవకాశం వచ్చినా చేసే వీలు కూడా ఉండదేమో. 
  

ప్రీతి జింటా ఆమె భర్త జీన్‌ గుడ్‌ఇనో:


ఇన్నాళ్లు బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు సౌత్ సిని ప్రేమికులను ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ప్రీతి జింటా ఇలా దేశం వదిలి వెళ్ళాలను కోవడం ఫ్యాన్స్ ను బాధపెట్టే విషయమే అయినా ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలన్నదే అభిమానుల ఆకాంక్ష కూడా. మరి ప్రీతి మళ్ళీ సినిమాల్లో చేస్తుందో లేదో తెలియాలంటే ఆమె మనసుని కదిలించి ఆమెను అక్కడనుండి ఇక్కడకు రప్పించే కథ దొరకాలన్నమాట. సో హ్యాపీ గా మారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ లాస్ ఏంజిల్స్ లో మఖాం పెట్టేందుకు సిద్ధమైన ప్రీతి జింటాకు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.   



మరింత సమాచారం తెలుసుకోండి: