హాలీవుడ్ లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘జంగిల్ బుక్’ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. భారత్ కంటే ఆలస్యంగా నార్త్ అమెరికాలో విడుదలైన ఈ సినిమాకు 680 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి.భారత్లో ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు పది రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటింది.ఈ సినిమా భారత్ సహా 15 దేశాల్లో 8వ తేదీ విడుదల కాగా, నార్త్ అమెరికాలో 15న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1588 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.  హాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. వాస్తవానికి జంగిల్ బుక్ తో భారతీయులందరికీ దూరదర్శన్ రోజుల నుంచీ అనుబంధం ఉంది. ముఖ్యంగా అందులో మోగ్లీ పాత్రకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.. అపట్లో చిన్న పిల్లలకు ఆ పేరు పెట్టుకున్న వారు కోట్లలో ఉన్నారు.

ద జంగిల్ బుక్


ఇప్పుడు  హాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమాను ఇండియన్ సినిమాలా భావించి ఆదరిస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్ణిస్తున ఈ సమయంలో మరో అద్భుత దృశ్యరూపమే ద జంగిల్ బుక్. సీజీఐ టెక్నాలజీతో ఆ ఫిల్మ్ డైరక్టర్ జాన్ ఫవ్రూ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. హీరో మోగ్లీ తప్ప మిగతా అన్ని క్యారక్టర్లు కంప్యూటర్ కళా చిత్రాలే. అంటే సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ.

ద జంగిల్ బుక్


 పాంథర్ భగీర, టైగర్ షేర్‌ఖాన్, ద బియర్ బాలూ, ద పైతాన్ కా, చింపాంజీ కింగ్ లూయి, మోగ్లీని పెంచి పోషించిన నక్కలు. ఆ మూగ జీవాలకు సీజీఐ టెక్నిక్ ప్రోణం పోసింది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీని. జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో నీల్ సేథి నటించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: