దర్శకడు బోయపాటి శ్రీను ‘సరైనోడు’ ప్రమోషన్ కోసం ఒక  టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ పై చేసిన  ఆసక్తికర వ్యాఖ్యలకు అల్లుఅర్జున్ తో పాటు అల్లుకాంపౌండ్ కూడ షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ‘బాలయ్య తన సినిమాలో చెప్పే డైలాగులకు చాలా పవర్ ఉంటుంది. ఆయన ఏదైనా మాట చెబితే అది సొసైటీలోకి చొచ్చుకుపోయేంత స్థాయిలో ఉంటాయి బాల్య డైలాగులు’ అంటూ తన మనసులోని అభిప్రాయాలను బయట పెట్టాడు బోయపాటి. 

అయితే ఈ కామెంట్స్ బోయపాటి ఏ ఉద్దేశ్యంతో అన్నడో అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఈకామెంట్స్ అల్లుకంపౌండ్ కు అనుకోని షాక్ ఇచ్చినట్లు టాక్. దర్శకుడు బోయపాటి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఎక్కువగా  చెప్పకుండా బాలకృష్ణ ప్రస్తావన బోయపాటి ఎందుకు తెచ్చినట్లు అని అల్లు కాంపౌండ్ ఈ కామెంట్స్ పట్ల కొంత అసోకర్యాన్ని ఫీల్ అవుతున్నట్లు టాక్. 

జనంలోకి వెళ్ళి పోయే విధంగా పవర్ఫుల్ డైలాగులు చెప్పే సమర్ధత మెగా టాప్ హీరోలకు కూడ ఉన్న విషయాన్ని బోయపాటి మరిచిపోయాడా అని అల్లు కాంపౌండ్ లోని కొందరు బోయపాటి వ్యాఖ్యల పై కామెంట్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు టాప్ హీరోలతో 6 సినిమాలను తీసిన బోయపాటి తాను ఇంకా ఆర్ధికంగా సెటిల్ కాలేదు అని అంటున్నారు. తమది జాయింట్ ఫ్యామిలీ కావడంతో తనకు బాధ్యతలు ఎక్కువ అని అంటున్నాడు బోయపాటి. 

‘సరైనోడు’ సినిమాను చూసి మెగా స్టార్ చిరంజీవి ఆనందం పట్టలేక బోయపాటిని తన ఇంటికి పిలిపించుకుని చిరంజీవి ఒక కథను తయారు చేయమన్నాడు అన్న న్యూస్ ప్రచారంలో ఉంది. అయితే ఆకథ తన కోసమా లేదంటే రామ్ చరణ్ కోసమా అనే విషయం పై ప్రస్తుతానికి సస్పెన్స్..  



మరింత సమాచారం తెలుసుకోండి: