చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేద్దామని దర్శకుడు వినాయక్ ప్రయత్నిస్తే ఆమె చిరంజీవి సినిమాలో నటించడానికి నో చెప్పడమే కాకుండా చిరూ సినిమాలో నటించాలి అంటే అత్యంత భారీ మొత్తంతో కూడిన పారోతోషికాన్ని అడిగినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న నయనతార మీడియా ముందుకు వచ్చి మరో షాక్ ఇచ్చింది. 

తనను ఇప్పటి వరకు ఎవరూ చిరంజీవి 150వ సినిమా విషయమై సంప్రదించలేదని అసలు ఆఫర్ కూడ రాని ఈ ప్రాజెక్ట్ కు తాను ఎలా నొ చెప్పానని వార్తలు వచ్చాయో తనకు అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నయన. అంతేకాదు తనను మెగా కాంపౌండ్ కు సంబంధించి ఏ హీరో కానీ దర్శకుడు కానీ చిరంజీవి 150వ సినిమా విషయంలో సంప్రదించలేదు అంటూ ఈ విషయానికి మరో ట్విస్ట్ ఇచ్చింది నయనతార.   

అయితే ఒకవైపు చిరంజీవి 150వ సినిమా గురించి కౌంట్ డౌన్ మొదలవుతూ ఉంటే నిన్న ఒక కోలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంయర్వ్యులో నయనతార ఇలా ఎందుకు మాట్లాడిందో అర్ధంకాని విషయంగా మారింది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ నెల 29న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవం జరగబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. 

ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో మొదలవుతుంది అని అంటున్నారు. ఈ రోజు సాయంత్రం ఈసినిమా నిర్మాతల నుండి ఒక అధికారిక ప్రకటన వస్తుంది అని ఫిలింనగర్ టాక్. ఒకవైపు నయనతార ఖండన మరొక వైపు చిరంజీవి సినిమా ముహూర్తం ఫిక్సింగ్ న్యూస్ ఇలా ఒకేసారి హడావిడి చేయడం మొదలు పెట్టడంతో ఈ రెండు న్యూస్ ల  మధ్య  ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో వార్తల హడావిడి జరుగుతోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: