తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రముఖ స్థానాన్ని సృష్టించిన ‘బాహుబలి’ కాని ఆ సినిమా దర్శకుడు రాజమౌళికి కాని సాక్షి పత్రిక అందచేసిన ఎక్సలెన్స్ అవార్డులలో ఒక్క విభాగంలో కూడ అవార్డును గెలుచుకోలేకపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘బాహుబలి’ కి నిన్న కన్నుల పండుగగా జరిగిన సాక్షి ఎక్సలెన్స్  అవార్డు ఫన్క్షంలో ఒక విధంగా అవమానమే జరిగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

క్రితం సంవత్సరం విడుదలైన మోస్ట్ పాపులర్ మూవీ అవార్ద్ ‘శ్రీమంతుడు’ సినిమా దక్కించు కుంటే మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు.మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోస్ట్ పాపులర్ డైరక్టర్ ఆఫ్ ది ఇయర్ సత్కారాన్ని ‘రుద్రమదేవి’ సినిమా దర్శకుడు గుణశేఖర్ కు ఇచ్చారు. ఇక స్పెషల్ జ్యూరీ అవార్డును క్రిష్ ‘కంచె’ కు ఇచ్చారు.

అయితే చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు కానీ దర్శకుడు రాజమౌళికి కాని కనీసం ఆసినిమాలో నటించిన నటీనటులకు కాని ఒక్క అవార్డు కూడ లేకపోవడం అత్యంత షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో రాజమౌళికి తీరని అవమానం జరిగింది అంటూ కొందరు అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ అవార్డ్స్ మీట్ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్ మాట్లాడుతూ తాను భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస్పూర్తిగా చెపుతున్నాను అంటూ ఈరోజు తనకు వచ్చిన ఈ జీవన సాఫల్య పురస్కారం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంతో సమానం అని చేసిన కామెంట్స్ అతిసయోక్తిగా అనిపించినా ఈ అవార్డుల స్థాయిని చాటుతున్నాయి అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: