‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ పెళ్ళి గురించి తరుచు గాసిప్పులు రావడం అలవాటుగా మారింది. ఆ మధ్య కృష్ణంరాజు ప్రభాస్ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన నేపధ్యంలో ప్రభాస్ పెళ్ళి వార్తల గాసిప్పులకు మరింత బలం చేకూరింది. 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ పెళ్లి కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా తెలుగు వారందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ పరిస్థుతులలో ప్రభాస్ పెళ్ళికి సంబంధించి మరో లేటెస్ట్ గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న ఈ గాసిప్ ప్రకారం ప్రభాస్  అనుష్క ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయిని ఇష్ట పడ్డాడని  ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడనే న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది. ‘బాహుబలి’ షూటింగ్ టైంలో అనుష్క ద్వారా ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారింది అని టాక్. 

తరుచూ ఆ అమ్మాయితో ప్రభాస్ టచ్ లో ఉంటున్నాడని. వీరి మద్య రాయబారిగా అనుష్క ఉందని ఫిలింనగర్ టాక్. అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అసలు ఈ అమ్మాయి  తెలుగు అమ్మాయి అవునా కాదా అనే విషయం పై ఇప్పుడు రకరకాల వార్తలు హడావిడి చేస్తున్నాయి. అసలు ఈ న్యూస్ ఎంత వరకు నిజమో అనే విషయం పై క్లారిటీ లేకపోయినా ఇప్పుడు ఈ లేటెస్ట్ గాసిప్ మాత్రం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ఈమధ్య ప్రభాస్ రాజమౌళిని కలిసి తనను ‘బాహుబలి 2’ నుండి ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగినప్పుడు రాజమౌళి నవ్వుతూ ఈ సంవత్సరాంతానికి అని జోక్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఎలా చూసుకున్నా ప్రభాస్ పెళ్ళి మాత్రం వచ్చే సంవత్సరమే అనే మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: