మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ‘జనతాగ్యారేజ్’ షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న జూనియర్ కు ఒక అనుకోని అతిథి రాక షాక్ ఇచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు మాత్రమే  కాకుండా  జూనియర్ ఎన్టీఆర్ కు కూడ జపాన్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది అన్న విషయం  తెలిసిందే. జూనియర్ సినిమాలు భారీ స్థాయిలో జపాన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ‘బాద్ షా’, ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాలు రిలీజైనపుడు జపాన్ లో మంచి కలెక్షన్ లు రావడమే కాకుండా అక్కడి  ఎన్టీఆర్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్  చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 

ఈ నేపధ్యంలో ఆ ఫ్యాన్స్ లో ఒకరు ఎన్టీఆర్ ను కలవడం కోసం ఏకంగా హైదరాబాద్ కు వచ్చేశాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఎన్టీఆర్ ను కలిసి షాక్ ఇచ్చాడు. ఆ వీరాభిమాని పేరు ‘నాన్’ తన కోసం ఒక అభిమాని అంతదూరం నుంచి రావడం చూసి ఎన్టీఆర్ షాక్ అవ్వడమే కాకుండా అతడిని చూసి జూనియర్ ఎంతో ఆనంద పడ్డాడట. 

‘జనతా గ్యారేజ్’ సెట్లో జపాన్ వీరాభిమాని జూనియర్ తో కలిసి ఫొటోలు తీయించుకోవడమే కాకుండా తాను జూనియర్ పై తయారు చేసిన ఒక ఫోటో ఆల్బమ్ ను జూనియర్ కు ఇచ్చి మరో షాక్ ఇచ్చాడు ఆ వీరాభిమాని. గతంలో జపాన్ అభిమానులు ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్ లో హడావిడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ కు జపాన్ లో పెరుగుతున్న క్రేజ్ రీత్యా జూనియర్ సినిమాలు అన్నిటినీ జపాన్ లో విడుదల చేస్తున్నారు. 

ఇదే బాటను అనుసరిస్తూ ‘జనతా గ్యారేజ్’ ను కూడ అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక తెలుగు హీరోకు జపాన్ లో అభిమానులు ఏర్పడటం ఒక సంచలనం అయితే ఏకంగా జూనియర్ డాన్స్ లను అనుకరిస్తూ జపాన్ యూత్ డాన్స్ లు చేయడం మరొక గొప్ప విషయం..



మరింత సమాచారం తెలుసుకోండి: