బాలకృష్ణ తన 100వ సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ స్టోరీని ఎంపిక చేసుకోవడం వెనుక ఓఅక వ్యక్తి కీలకంగా వ్యావహరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. అప్పటి దాక బాలకృష్ణ ఆలోచనలను మార్చి వేసి బాలయ్య మనసును ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వైపు పరుగులు తీయించడంలో ఈ వ్యక్తి ప్రభావం అత్యంత కీలకం అని అంటున్నారు.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఆ వ్యక్తి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేసిన ఆచార్య రంగనాయకులు అని తెలుస్తోంది. చరిత్ర పట్ల ముఖ్యంగా శాతవాహనుల చరిత్ర పట్ల ఈ అధ్యాపకుడు రంగ నాయకులకు విపరీతమైన పట్టు ఉంది అని సమాచారం. దాదాపు రెండేళ్ళ పాటు శాతవాహనుల చరిత్ర పై ఎంతో అధ్యయనం చేసిన రంగనాయకులు 6 నెలల క్రితం బాలకృష్ణను కలిసి ఈ కథను వినిపించడంతో అప్పుడే ఈకథ బాలయ్య మైండ్ లో రిజిష్టర్ అయింది అని అంటున్నారు.
 

సింగీతం శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, కృష్ణవంశీ లాంటి డైరెక్టర్లను కాదని క్రిష్‌తో మూవీ చేయడానికి గల ప్రధాన కారణాలలో రంగ నాయకుల ప్రభావం చాల ఉంది అని టాక్. ఆంధ్రుల రాజు వంశాలకు మూలమైన శాతవాహన చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లైఫ్ స్టోరీని మూవీగా చేయాలంటే ఎంతో నేర్పు, ఓర్పు, శ్రమ, పరిశోధన అవసరం కాబట్టి ఇప్పుడు ఆ లెక్చరర్ రంగ నాయకులు క్రిష్ కు తన సహకారాలను అందిస్తూ అనేక విషయాల పై తన పరిశోధనలలో తెలుసుకున్న విషయాలను క్రిష్ తో షేర్ చేసుకుంటున్నట్లు టాక్. 

గతంలో నందమూరి తారకరామారావు ఇలాంటి చారిత్రాత్మక సినిమాలను తీసేడప్పుడు లెక్చరర్ నాగ భైరవ కోటేశ్వరరావు చేత స్క్రిప్ట్ లు వ్రాయిస్తూ ఉండేవారు ఎన్టీఆర్. ఇప్పుడు బాలకృష్ణ తన తండ్రి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇలా మరో లెక్చరర్ చేత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్క్రిప్ట్ వ్రాయించడం యాదృచ్చికం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: