సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న భామలెంతమంది ఉన్నా దశాబ్ధ కాలంగా నెంబర్ వన్ హీరోయిన్ రేసులో ఉండి తనకు తానే పోటీ అంటూ విజయాలను సొంతం చేసుకుంటుంది ఓ కేరళ కుట్టి. తమిళ పరిశ్రమలో చిన్నగా ఎంట్రీ ఇచ్చిన ఆ సుందరి తెలుగు, తమిళ మయలాళ భాషల్లో హిట్లు మీద హిట్స్ కొడుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించింది.


అయ్యా అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది నయన తార. దాదాపు దశాబ్ద కాలం నుండి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు అలాంటి క్రేజ్ నే మెయింటైన్ చేస్తూ సూపర్ అనిపించుకుంటుంది నయన్. ఇక తమిళ్ లో అయితే నయనతార ఇమేజ్ ఓ స్టార్ హీరోతో సమానమంటే నమ్మాలి. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నయనతార ప్రముఖ ఆంగ్ల దినపత్రిక జరిపిన టాప్ సౌత్ హీరోయిన్స్ లో మొదటి స్థానం సంపాదించింది.   


కొనాళ్లుగా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అభినయానికి ప్రాముఖ్యయ ఉన్న పాత్రల్లో చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్న నయనతార ఇప్పుడు మళ్లీ విక్రం సరసన ఇరుముగన్ సినిమాలో గ్లామర్ రోల్ చేస్తుంది. చేసే ఏ రోల్ అయినా సరే నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తుంది కాబట్టే ఆమెను అభిమానిస్తున్నారు ప్రేక్షకులు.


మరి ఈ సంవత్సరమే కాదు మరో ఐదేళ్ల తర్వాత కూడా జరిగే పోల్స్ లో నయనతారనే మొదటి స్థానంలో ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలో శృతి హాసన్ రెండవ స్థానంలో ఉండగా బ్రిటీష్ భామ ఎమీ జాక్సన్ మూడో స్థానంలో ఉంది. ఇక అనుష్క, తమన్నాలు 4,5 స్థానాల్లో ఉండగా.. త్రిష, హాన్సిక ఆ తర్వాత స్థానాలకే పరిమితమయ్యారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: