మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న ‘కత్తిలాంటోడు’ సినిమా ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన వార్తల హడావిడి ఊపు అందుకుంది. ఈసినిమాలోని చాల సన్నివేశాలు చిరంజీవి తన పొలిటికల్ రీ లాంచ్ కు అనుగుణంగా మార్చుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఈ ఆలోచనలకు అనుగుణంగానే ఈసినిమాలో కొన్ని సీన్స్ నేటి రాజకీయాలను ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం రైతులు దగ్గర భూములను తీసుకున్న నేపధ్యాన్ని హైలెట్ చేస్తూ అందులోని రాజకీయ కోణాలను టార్గెట్ చేసే విధంగా ‘కత్తి’ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ తయారైంది అన్న వార్తలు వస్తున్నాయి. ద గుడ్ లైఫ్, ట్రిపికల్ అటాక్, ఎ న్యూ స్టెప్ వంటి క్యాప్షన్స్ తో నిన్న విడుదలైన ‘కత్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చిరంజీవి తన పొలిటికల్ రీ ఎంట్రీకి సాధనంగా ఈసినిమాను వాడుకోబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే ఈ పొలిటికల్ రీ ఎంట్రీకి చిరంజీవి ప్రస్తుతం తాను కొనసాగుతున్న కాంగ్రెస్ ను ఆధారంగా చేసుకుని అడుగులు వేస్తాడా ? లేదంటే భారతీయ జనతాపార్టీని ఆలంబనగా చేసుకుని చిరంజీవి తన రాజకీయ ఎత్తుగడలు ప్రదర్శిస్తాడా ? లేకుంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ను తన పొలిటికల్ రీ ఎంట్రీకి ఆయుధంగా మార్చుకుని సంచలనాలు సృష్టిస్తాడా ? అనే విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఈ ‘కత్తి’ సినిమా రిజల్ట్ బట్టి చిరంజీవి భవిష్యత్ రాజకీయ అడుగులు ఉంటాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి ముహూర్తం కుదరడంతో మెగా ఫ్యా్న్స్ తోపాటు మెగా ఫ్యామిలీకూడా మాంచి జోష్ లో ఉంది. 

మెగా కుర్రహీరోలైతే పండుగే చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమాను సింబాలిక్ గా చూపెడుతూ చిరంజీవితో తీయిoచుకున్న  స్టిల్  ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. చేతివేళ్లతో చిరంజీవి 1 నెంబర్ చూపిస్తే, వరుణ్ తేజ్ ఐదు, సున్నా సింబల్స్ చూపిస్తూ 150వ సినిమా అంటూ తీయించుకున్న ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవ వేడుకను అతి నిరాడంబరంగా నిర్వహించాలని మెగా కుటుంబం తాజా నిర్ణయం తీసుకున్నట్లు టాక్.కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యే ఈ ప్రారంభోత్సవ వేడుక ఇంత సింపుల్ గా నిర్వహించడం వెనుక అర్ధాలు ఏమిటి అన్న విషయమై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: