హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన వాలు కనులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసిన అదా శర్మ సినిమాలైతే చేస్తుంది కాని హిట్ మాత్రం కొట్టట్లేదు. అయితే సడెన్ గా వచ్చిన ఓ సినిమా మాత్రం అమ్మడి ఎకౌంట్ లో ఓ సూపర్ హిట్ పడేలా చేసుకుంది. హిట్ తాలూఖా పరిణామాల్లో తానెంత ఉపయోగపడిందో అనే దాని కన్నా అదా శర్మ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 


క్షణం అంటూ చేసిన ఓ చిన్న ప్రయత్నం సూపర్ హిట్ అయ్యింది. తన పాపను మిస్ చేసుకున్న తల్లి పాత్రలో అదా శర్మ తన అద్భుత నటనను ప్రదర్శించిందని చెప్పొచ్చు. అయితే ఇదే తనకు ఓ భారీ లక్కీ ఆఫర్ ను తెచ్చిపెట్టింది. తెలుగులో సూపర్ హిట్ అయిన క్షణం సినిమాను బాలీవుడ్లో భారీ రేంజ్ లో నిర్మించాలనుకుంటున్నారు.


క్షణం సినిమాలో అదా శర్మ :


ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ గా అదా శర్మనే సెలెక్ట్ చేశారని సమాచారం. అయితే తొలి సినిమా బాలీవుడ్లో చేసినా తెలుగులో ఆఫర్ రాగానే ఇక్కడకు వచ్చిన అదా ఇక్కడే సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో సినిమాలైతే చేస్తుంది కాని అవి ప్రేక్షకులకు చేరువవ్వలేదు.


పర్ఫెక్ట్ ఫిగర్ కు ప్రతి రూపమైన అదాకు క్షణం హిట్ అయ్యి అదే బాలీవుడ్ ఆఫర్ ను తీసుకురావడం గొప్ప విషయం,. మరి బీ టౌన్లో అయినా వరుసెంట హిట్ సినిమాలు చేయాలాని ఆకాంక్షిద్దాం. హిట్ మజాను ఎంజాయ్ చేస్తున్న అదా శర్మ ఇకనుండి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేయాలనుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: