దర్శకుడు బోయపాటి రెండు రోజుల క్రితం జరిగిన ‘సరైనోడు’ సక్సస్ మీట్ లో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అంటూ  కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ కామెంట్స్ వివరాలలోకి వెళ్ళితే ‘సరైనోడు’ సినిమా సక్సెస్ మీట్ లో  బోయపాటి మాటలు కేవలం తడ బాటులో వచ్చినవా ? లేదంటే కావాలనే అలా మాట్లాడడా అన్న సందేహాలు కల్గుతున్నాయి అని అంటున్నారు. 

‘లెజండ్’ సినిమా తీసిన తరువాత ‘సరైనోడు’ తనకు  లైఫ్ అండ్ డెత్ లా మారింది అని అంటూ వెంటనే సర్దుకుని తాను చేసే ప్రతీ సినిమా కూడా మొదటి సినిమా లాంటిదే అంటూ తన మాటలను సర్దుబాటు చేసుకున్నాడు. దీనితో ఆ సక్సస్స్ మీట్ కు వచ్చిన చాలా మంది షాక్ అయినట్లు టాక్. లెజెండ్ లాంటి సూపర్ హిట్ తీసాక కూడ అవకాశాలు రాకపోవడంతో టాప్ హీరోల చుట్టూ తిరిగి చిట్టచివరకు బన్నీని ఏదో విధంగా ఒప్పించిన సంఘటన గుర్తుచేసుకుని విసుగుతో బోయపాటి ఈకామెంట్ చేసి ఉంటాడని మాటలు వినిపిస్తున్నాయి.

‘లెజెండ్’ తరువాత పెద్ద హీరోలు ఎవ్వరూ సినిమాలు  ఆఫర్ చేయకపోతే  బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాను మొదలు పెట్టిన బోయపాటి చిట్టచివరకు బన్నీతో సినిమాను చేసినా అల్లు కాంపౌండ్ దెబ్బతో బోయపాటి అతి కష్టం పై ఈ ‘సరైనోడు’ పూర్తి చేసాడు అన్న వార్తలు ఉన్నాయి. ఆభాధతోనే బోయపాటి ఈవిధంగా కామెంట్ చేసి ఉంటాడని అంటున్నారు.

ఇక బోయపాటి కామెంట్స్ ఎలా ఉన్నా ‘సరైనోడు’ తన బాలా అరిష్టాలను దాటుకుని నిన్న మంగళవారం కూడ మన తెలుగు రాష్ట్రాలలో మంచి కలక్షన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమా బన్నీ ‘రేసుగుర్రం’ రికార్డ్స్ ను క్రాస్ చేస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఏమైనా బోయపాటి అదృష్టవంతుడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: