అల్లుఅర్జున్ నటించిన సరైనోడు మూవీ బాక్సాపీస్ వద్ద సంచలన రికార్డ్స్ ని కొల్లగొడుతుంది. అయితే అల్లుఅర్జున్ నటించిన ఈ సరైనోడు మూవీలో, బన్నీకి నచ్చిన క్యారెక్టర్ విలన్ రోల్. సరైనోడు ఆడియో ఫంక్షన్ వేధికలో అల్లుఅర్జున్ ఇదే విషయాన్ని అందరికి చెప్పుకొచ్చాడు. ఇతర భాషల్లో సరైనోడు మూవీని రిమేక్ చేస్తే…అందులో కచ్ఛితంగా తను విలన్ రోల్ చేస్తానని చెప్పుకొచ్చాడు.


ఇప్పుడు దీనికి సంబంధించిన చర్ఛలు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. తెలుగులో సరైనోడు మూవీకి ఆధరణ తక్కువయినప్పటికీ…మాస్ ని బాగా ఇష్టపడే కోలీవుడ్ ప్రేక్షకులకి ఈ మూవీ బాగా నచ్చుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ మూవీని కోలీవుఢ్ లో రిమేక్ చేస్తే బాగుంటుందని కొందరు ఆలోచిస్తున్నారు.


దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే పెద్ద హీరోలతో టాప్ డైరెక్టర్స్ చర్ఛలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా విలన్ రోల్ కి సంబంధించిన చర్ఛలు కూడ జరిగాయని అంటున్నారు. ఇక కోలీవుడ్ లో జరిగిన చర్ఛల ప్రకారం చూస్తే…ఒకవేళ ఈ మూవీని కోలీవుడ్ లో రిమేక్ చేస్తే ఇందులో విలన్ గా కోలీవుడ్ ఆర్టిస్ట్ నే తీసుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చారంట.


అల్లుఅర్జున్ ని ఇందులో విలన్ గా తీసుకునే ఛాన్స్ లేదని తేల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ కొంత షాక్ కి గరైయాడని అంటున్నారు. కోలీవుడ్ లో విలన్ రోల్ కోసం ప్రత్యేకమైన ఆర్టిస్ట్ లు ఉన్నారు. వారికి ప్రేక్షక ఆధరణ ఎక్కువుగా ఉంది. దీంతో సరైనోడు కోలీవుడ్ రిమేక్ లో అల్లుఅర్జున్ కి విలన్ రోల్ బెర్త్ దొరికే ఛాన్స్ లేనట్టుగా ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: