వివాదాల రామ్ గోపాల వర్మ ఇప్పటి వరకు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తన ట్విటర్ లో కామెంట్ చేసాడు కాని ఇప్పటి వరకు వర్మ దృష్టి బన్నీ పై పడలేదు. అయితే అనూహ్యంగా వర్మ దృష్టి నిన్న రాత్రి అల్లుఅర్జున్ పై పడింది. దీనితో బన్నీని టార్గెట్ చేస్తూ ఒక విచిత్రమైన ట్విట్ పెట్టాడు వర్మ. 

కొద్ది రోజుల క్రితం తాను ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి కామెంట్స్ చేయనని మాట ఇచ్చిన వర్మ మళ్ళీ తన మాట తప్పి ఈసారి ఏకంగా అల్లుఅర్జున్ స్టామినాను పవన్ స్టామినాతో పోలుస్తూ మరో వివాదాస్పద ట్విట్ పెట్టాడు వర్మ. ఈ ట్విట్ ద్వారా మెగా ఫ్యాన్స్ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ‘ఎంతో పెద్దదైన సర్దార్ సినిమాకంటే.. సరైనోడు చాలా పెద్ద హిట్. అంటే బన్నీ చాలా పెద్దాడనేగా’ అంటూ పవన్ ను చిన్న చూపు చూస్తూ మరో వివాదానికి తెర తీసాడు వర్మ.

‘అసలు పవన్ తో కంపేర్ చేస్తే బన్నీ గురించి ఎప్పుడూ ఏమీ ఆలోచించలేదు. కాని సరైనోడు సినిమాతో పవన్ కంటే బన్నీ పెద్దాడు అని ప్రూవ్ అవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’ అంటూ పవన్ పై మరొక సెటైర్ వేసాడు వర్మ. అయితే ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ వీరాభిమానులకు వర్మ పెట్టిన లేటెస్ట్ ట్విట్ విపరీతమైన కోపం తెప్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

‘సరైనోడు’ కలక్షన్స్ రీత్యా పవన్ ‘సర్దార్’ కన్నా ముందడుగులో ఉన్నా ఇమేజ్ రీత్యా అల్లుఅర్జున్ పవన్ తరువాతి స్థానంలోనే ఉంటాడు అన్న విషయం వర్మకు తెలిసినా కొత్త మెగా పోరుకు వర్మ ఎందుకు తెర తీసాడు అన్నది షాకింగ్. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఎస్.జె.సూర్యా దర్సత్వంలో నటిస్తున్న కొత్త సినిమాకు ఈరోజు ఉదయం  10.15 నిముషాలకు ఎటువంటి హడావిడి లేకుండా ప్రారంభించడం మరో షాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: