సూపర్ స్టార్స్ తో పనిచేసే అవకాశం రావడం ఓ అదృష్టం అది కెరియర్ తొలినాళ్లలో వస్తే అది ఇంకా సూపర్.. ఇక వారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఫీలింగ్ కన్నా వారితో సెట్స్ లో ఉండే టైంను ఎక్కువ ప్రస్థావిస్తుంటారు హీరోయిన్స్. ప్రస్తుతం ఓ భామ తాను సూపర్ స్టార్ తో పనిచేయడం ఆయనతో గడిపిన క్షణాలను మరిచిపోలేను అంటుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


సౌత్ ఇండియన్ హాట్ యాక్ట్రెస్ రాధికా ఆప్టె. ఓ పక్క హాట్ హాట్ గా సంచలనాలు సృష్టిస్తూనే మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రజినికాంత్ సరసన కబాలి సినిమాలో నటిస్తున్న రాధికా ఆప్టె రజినితో నటించడం ఓ అద్భుతమైన ఫీలింగ్ అని.. ఆయనతో నటించడం ఓ అత్యుత్తమ అనుభవమని.. ఎంతో స్పూర్తిదాయకమని అంటుంది.  


కబాలి సినిమాలో రజినికాంత్ :


రజినితో ఎవరు నటించినా ఇలాంటి రెస్పాన్సే ఇస్తారు. నటనే కాదు సహ నటుల పట్ల కూడా రజిని ఎంతో మర్యాదగా ఉంటారు. అందుకే ఆయన్ను సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ను చేసింది. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న కాబాలి సినిమాను కలైపులి ఎస్.థను నిర్మిస్తున్నారు.  


భాషా తర్వాత మాఫియా డాన్ గా నటిస్తున్న రజిని ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. జూన్ లో సినిమా రిలీజ్ అంటున్న కబాలి టీజర్ మే 1న రిలీజ్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: