హీరోలని మర్చిపోగలం కానీ కడుపు ఉబ్బిపోయే లాగా నవ్వించే కమెడియన్ ని ఎవరు మాత్రం మరచిపోగలరు ? పర్సనాలిటీ తక్కువగా ఉన్న బాగా నవ్వించే వేణు మాధవ్ లాంటి మిమిక్రీ కమీడియన్ లని అసలు మర్చిపోలేం మనం. మిమిక్రీ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వేణు మాధవ్ తక్కువ కాలం లోనే అగ్రశ్రేణి హాస్య నటుల జాబితా లో చేరిపోయారు. కానీ ఈ మధ్య కాలం లో మాధవ్ ఎక్కడా కనపడ్డం లేని పరిస్థితి. అనారోగ్యం పాలు అయ్యాడా లేక అవకాశాలు రావడం లేదా అని చాలా ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి.


నల్గొండ జిల్లా కోదాడ కి చెందిన వేణు మాధవ్ 1996 సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు ఆ తరవాత చాలా సినిమాలు చేస్తూ చిరంజీవి అంతటి సూపర్ స్టార్ పక్కన కూడా నటించారు. అందరు పెద్ద హీరోలతో సినిమాలు చేసిన వేణు ప్రస్తుతం ఆరోగ్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నాడు అంటున్నారు. ఫిట్స్రోగం తో ఇబ్బంది పడుతున్న వేణు ఫిట్స్వ్యాధి ఉండడం వలన షూటింగ్ స్పాట్ లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉండడం వలన ఇప్పుడు ఏ సినిమా అవకాశం రాని పరిస్థితి. మరో వర్గం వారు ఆయనకీ షుగర్ వ్యాధి కూడా బాగా ముదిరింది అని అంటున్నారు , ఆయన ఆరోగ్యం కుదుటపడి త్వరగా సినిమాలలోకి రావాలి అని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: