జూనియర్ ఎన్టీఆర్ కు రాజమౌళికి గల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. రాజమౌళిని జక్కన్న అంటూ అభిమానంగా పిలిచే జూనియర్ కోసం ఒక ప్రత్యేక పాత్రను ‘బాహుబలి 2’ లో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రాజమౌళికి వచ్చినట్లు టాక్. ఈ ఆలోచన రాజమౌళికి రావడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ‘బాహుబలి 2’ లో కోలీవుడ్ హీరో సూర్యా కోసం ఒక ప్రత్యేక పాత్రను రాజమౌళి క్రియేట్ చేస్తున్నాడు. 

సూర్యా వల్ల ‘బాహుబలి 2’ కు కోలీవుడ్ లో ఇంకా బారీ కలక్షన్స్ వస్తాయని రాజమౌళి ఎత్తుగడ. ఇప్పుడు అదే ఎత్తుగడ రాజమౌళి ‘బాహుబలి 2’ తెలుగు వర్షన్ కు కూడ అన్వయించేలా ఒక మాస్టర్ ప్లాన్ ను రచించినట్లు టాక్. జూనియర్ కు ఉన్న క్రేజ్ రీత్యా అతడికి కూడ ఒక ప్రత్యేక అతిథి పాత్రను ‘బాహుబలి 2’ లో క్రియేట్ చేస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడమే కాకుండా ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి కూడ జూనియర్ రాక మరింత సహకరిస్తుంది అని రాజమౌళి ఊహ అని అంటున్నారు. 

ఇలాంటి ఆలోచనలతో రాజమౌళి జూనియర్ ను ఈమధ్య వ్యక్తిగతంగా కలిసి ఈ విషయమై చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ వార్తలు యదార్ధం అయితే జూనియర్ అభిమానులకు అది పండుగే అనుకోవాలి. ఈ వార్తలు ఇలా ఉండగా ‘బాహుబలి-2’కి సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా సోకింది. 

మండే ఎండల కారణంగా ఈ సినిమా షూటింగ్ ను మే నెల 1 నుంచి జూన్ 15 వరకు షూటింగ్ నిలిపివేస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ పిరియడ్ లో జక్కన్న తన ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెళ్తాడని, హీరో ప్రభాస్ యూఎస్‌కు, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. సమ్మర్ కు ‘బాహుబలి’ టీమ్ విదేశాలకు వెళుతూ ఈరకంగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: