‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఘోర పరాజయం తరువాత నిన్న ప్రారంభమైన పవన్ ఎస్.జె. సూర్యల కొత్త మూవీ మూల కథ లైన్ బయటకు వచ్చింది. ఈసినిమా పూజా కార్యక్రమం జరిగి ఒకరోజు గడవకుండానే ఈసినిమా కథ గురించి లీకులు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ లేటెస్ట్ మూవీ ఒక ఫ్యాక్షన్ లీడర్ ప్రేమ కథ అని వార్తలు వస్తున్నాయి. పవన్ ఈసినిమాలో ఫ్యాక్షన్ లీడర్ గా ప్రేమికుడుగా రెండు షేడ్స్ లో కనపడతాడని తెలుస్తోంది.

ఈసినిమా కథను రచయిత ఆకుల శివ ఈసినిమా దర్శకుడు ఎస్.జె. సూర్యతో కలిసి దాదాపు నాలుగు నెలలు నేటి యూత్ కు టచ్ చేసే విధంగా వ్రాశాడు అని తెలుస్తోంది. ఈకథ పూర్తి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటూ బ్యాక్ డ్రాప్ లో మాఫియా స్టోరీ చుట్టూ తిరుగు తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాటల రికార్దింగ్ ను కూడ ముగించాడు.

రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ కు ఫోటోగ్రాఫీ అందించిన సౌందర్ రాజన్ ఈసినిమాకు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. అదేవిధంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన బ్రహ్మ కడలి ఫైట్ మాస్టర్స్ గా పనిచేసిన రామ్ లక్ష్మణ్ లు ఈసినిమాకు కూడ పనిచేస్తున్నారు. యూత్ ను టార్గెట్ చేసే విధంగా ఈసినిమాకు ‘హుషారు’ అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ టైటిల్ విషయమై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తోంది. ఒక కొత్త బొంబాయి అమ్మాయి ఈసినిమాకు హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈవార్తలు ఇలాఉండగా నిన్న జరిగిన ఈసినిమా పూజా కార్యక్రమానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిస్ట్రిబ్యూటర్లు కూడ చాలామంది హాజరు అయినట్లు టాక్. తీవ్రంగా నష్టపోయిన ఈ డిస్ట్రిబ్యూటర్లను నిర్మాత శరత్ మరార్ పలకరించడమే కాకుండా నష్టపోయిన ఆ డిస్ట్రిబ్యూటర్లకు పవన్ లేటెస్ట్ మూవీ ఏరియా రేట్స్ ను మార్కెట్ రేటు కంటే 25 శాతం తక్కువ రేటుకు ఈ నష్టపోయిన ‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి ఆదుకుంటామని శరత్ మరార్ వాగ్దానం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే పవన్ లేటెస్ట్ సినిమా కథ గురించి బయటకు వస్తున్న లీకులు వింటూ ఉంటే 2011 లో విడుదలైన పవన్ ‘పంజా’ సినిమా కథ గుర్తుకు వస్తోంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: