రేపు విడుదల కాబోతున్న నారా రోహిత్ ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా పై ఫిలింనగర్ లో విడుదల కాకుండానే పాజిటివ్ టాక్ రన్ అవుతోంది. హీరోలుగా చేసిన నటులు విలన్ గా అవతారమెత్తి సినిమాలలో నటిస్తూ ఉంటే ఆ సినిమాలకు మంచి క్రేజ్ వస్తోంది. ‘లెజెండ్’ సినిమా సక్సెస్ కావడానికి అదేవిధంగా లేటెస్ట్ గా విడుదలైన ‘సరైనోడు’ సక్సస్ కావడానికి ఆ సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన జగపతి బాబు ఆది పినిశెట్టిల స్టైలిష్ నటన ఎంతగానో ఆ సినిమాల విజయాలకు సహకరించింది. 

‘ఫిలింనగర్ లో ఈసినిమా గురించి లీక్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నారా రోహిత్-నందమూరి తారకరత్నల మధ్య పోరు ‘లెజెండ్’ సినిమాను గుర్తుకు తెస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోగా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయిన తారకరత్న ‘రాజా చెయ్యి వేస్తే’ కోసం పూర్తిగా అవతారం మార్చుకుని సరికొత్తగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో తారకరత్న లుక్ మేననరిజమ్స్ డైలాగులు  చూస్తే ఇది వెయిట్ ఉన్న పాత్రలాగే కనిపిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నారా రోహిత్ కూడా చాల స్టైలిష్ గా కనిపిస్తూ ఈసినిమా సక్సస్ కు కీలకంగా మారి సైలెంట్ కిల్లర్ గా మారబోతున్నాడా అన్న సందేహాలను కూడ కొంత మంది వ్యక్త పరుస్తున్నారు. ఇది యిలా ఉండగా ఈసినిమాలో నారా రోహిత్. బోలెడన్ని స్క్రిప్టులు చేతిలో పట్టుకుని కనిపించిన సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ దర్శకుడుగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కనిపించే పాత్రలో కనిపిస్తాడట నారా రోహిత్. 

మొదటి హాఫ్ లో ఇలా కనిపించే రోహిత్ సెకెండాఫ్ లో అసలు కథ మొదలై విలన్ తారక్ తో ఆడే మైండ్ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ‘సరైనోడు’ కలక్షన్స్ హడావిడి చేస్తున్నా ఆ విషయాలు ఏమి పట్టించుకోకుండా దూసుకు వస్తున్న ఈ ‘రాజా చెయ్యి వేస్తే’ ను చూస్తూ ఉంటే ‘సరైనోడు’ కి సైలెంట్ కిల్లర్ గా మారబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: