మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరి మధ్య ఎలాంటి విభేధాలు లేవు అన్నది సర్దార్ ఆడియోలో అన్నదమ్ముల అనుబంధం చూసి మనకు అర్ధమైంది. అయితే చేయక చేయక చిరు తాను సోలోగా సినిమా చేస్తూ ఓపెనింగ్ పెట్టుకుంటే అదే రోజున తన సినిమా ఓపెనింగ్ పెట్టుకున్నాడని మెగా అభిమానులే కాదు సినిమా వాళ్లు కూడా షాక్ అయ్యారు.


అయితే ఈ నెల 29న మెగాస్టార్ కత్తిలాంటోడు, పవర్ స్టార్ ఎస్.జె సూర్య సినిమా ఓపెనింగ్ అని అనుకున్నా.. చేయక చేయక ఫుల్ టైం సినిమా చేస్తున్న అన్నయ్య ముహుర్తానికి తమ్ముడు పవన్ అటెండ్ అవ్వకపోతే మళ్లీ మీడియా వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే నిన్న సైలెంట్ గా ఎస్.జె.సూర్య సినిమాను స్టార్ట్ చేసేశాడు పవన్ కళ్యాణ్.


పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య సినిమా ఓపెనింగ్ :


ఇక వినాయక్ దర్శకత్వంలో కత్తిలాంటోడికి మెగాస్టార్ రెడీ అవడం విశేషం. దాదాపు 7 ఏళ్ల తర్వాత చిరు నటిస్తున్న సోలో సినిమా కాబట్టి సినిమా మీద ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. అయితే ఆ అంచనాలు అందుకునే సినిమా కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేయించాడు మెగాస్టార్. ఇక రేపు జరుగనున్న ఈ ఈవెంట్ కు మెగా హీరోలంతా అటెండ్ అవుతారని తెలుస్తుంది.


మెగాస్టార్ వేసిన బాటలో వెళ్తూ మెగా హీరోలుగా మెగా అభిమానుల హృదయాల్లో చెరిగిపోని అభిమానాన్ని సంపాదించిన మెగా హీరోలకు మెగా అభిమానులు ఎప్పుడూ తోడుంటారని వారు చేసే కార్యక్రమాల ద్వారానే తెలుపుతున్నారు. మరి మెగాస్టార్ మెగా మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: